ఒంటిమిట్ట: ఒంటిమిట్ట వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం జరిగిన సీతారాముల కల్యాణంలో పంపిణీ చేయగా మిగిలిన ముత్యాతలంబ్రాలను గురువారం ఒంటిమిట్ట రామాలయంలో స్వామి దర్శనానికి విచ్చేసిన భక్తులకు టీటీడీ అధికారులు పంపిణీ చేశారు. ముత్యాలతలంబ్రాలు పంపిణీ చేస్తున్నారని తెలుసుకున్న భక్తులు ఒంటిమిట్ట రామాలయానికి పోటెత్తారు. ఈ నేపథ్యంలో భక్తుల మధ్య తోపులా కూడా జరిగింది. భక్తులకు ఇవ్వాల్సిన ముత్యాతలంబ్రాలు అధిక మొత్తంలో పోలీసులు, విజిలెన్స్ అధికారులకు, సిబ్బందికి టీటీడీ అధికారులు ఇవ్వడంపై భక్తులు ఆగ్రహించారు. ఈ నేపథ్యంలో టీటీడీ అధికారులు, భక్తుల మద్య కాసింత వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది.


