లూర్దుమాతపై విశ్వాసం ముక్తికి సోపానం | - | Sakshi
Sakshi News home page

లూర్దుమాతపై విశ్వాసం ముక్తికి సోపానం

Feb 6 2026 7:43 AM | Updated on Feb 6 2026 7:43 AM

లూర్ద

లూర్దుమాతపై విశ్వాసం ముక్తికి సోపానం

ప్రార్థనల్లో పాల్గొన్న విశ్వాసులు

దైవ సందేశం ఇస్తున్న ఫాదర్‌ ఎస్‌.మర్రెడ్డి

కడప సెవెన్‌రోడ్స్‌: పవిత్ర లూర్దుమాతపై విశ్వాసం ముక్తికి సోపానమని లక్కిరెడ్డిపల్లె విచారణ గురువులు విజయమోహన్‌రెడ్డి అన్నారు. లూర్దుమాత ఉత్సవాల్లో భాగంగా నాల్గవరోజైన గురువారం కడప పాత చర్చి ఆవరణలో ఫాదర్‌ విజయమోహన్‌రెడ్డి దివ్యబలిపూజ నిర్వహించి ప్రసంగించారు. ఏసుక్రీస్తుపై విశ్వాసం ఉంచిన వారు నిత్య జీవం పొందుతారన్నారు. మరియమాత కరుణామూర్తి అని, లోకానికి రక్షణ కోసం ఏసుక్రీస్తును భువి నుంచి దివికి తీసుకొచ్చారని వివరించారు. ముద్దనూరు విచారణ గురువులు ఎస్‌.మర్రెడ్డి మాట్లాడుతూ ప్రతి క్రైస్తవుడు ఏసు చూపిన జీవితాన్ని అలవర్చుకోవాలని సూచించారు. మరియమాత బిడ్డలైన మనం సమాజానికి మార్గదర్శకంగా ఉండాలని ఉపదేశించారు. తిరునాల ఉత్సవాల్లో భాగంగా నవదిన జపమాల కార్యక్రమం నిర్వహించారు. మహిళలు భక్తిశ్రద్ధలతో లూర్దుమాత స్వరూపాన్ని మరియాపురం వీధుల్లో ఊరేగించారు. పూజకు ముందు ఏసుక్రీస్తుకు గుర్తుగా ఉన్న దీప స్తంభానికి గురువులు, కన్యసీ్త్రలు జ్యోతి ప్రజ్వలన చేశారు. దివ్య బలి పూజ కార్యక్రమంలో విచారణ గురువు ఈరి లూర్దు మరియన్న, సహాయ గురువు జంపంగి సుధాకర్‌, కడప డీన్‌ ఎండీ ప్రసాద్‌రావు, ఫాదర్‌ సిప్రియన్‌, ఫాదర్‌ సంబటూరు సురేష్‌, తిరునాల కమిటీ అధ్యక్షులు సి.బాలయ్య, ప్రధాన కార్యదర్శి జోసెఫ్‌, ఉపాధ్యక్షులు లూర్దు, ట్రెజరర్‌ విజయరాజు, ఎంవీ అల్ఫోన్స్‌, జయరాజు, విశ్వాసులు పాల్గొన్నారు.

లూర్దుమాతపై విశ్వాసం ముక్తికి సోపానం 1
1/1

లూర్దుమాతపై విశ్వాసం ముక్తికి సోపానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement