ఏపీడబ్ల్యూజేఎఫ్ కమిటీ ఏర్పాటు
మదనపల్లె : ఏపీడబ్ల్యూజే జిల్లా కమిటీని మదనపల్లెలో జరిగిన సమావేశంలో ఎన్నుకున్నట్టు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఆంజనేయులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కన్వీనర్‌గా జి.రమేష్ (మదనపల్లె), కో–కన్వీనర్లుగా ఎన్.చంద్ర (మదనపల్లె), ఎస్.రవీంద్ర (మదనపల్లె), జి.గిరిశేఖర్ (మదనపల్లె), ఎల్.నాగరాజు (పుంగనూరు), ఎం.శ్రీనివాసులునాయుడు (పీలేరు), బి.వెంకటరమణ(పీలేరు), జి.శివప్రసాద్ (రాయచోటి), సి.రామకృష్ణారెడ్డి (తంబళ్లపల్లె), ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా కన్వీనర్లుగా వి.రెడ్డిప్రసాద్(మదనపల్లె), ఎస్.రమేష్‌రాజులను ఎన్నుకున్నట్టు పేర్కొన్నారు.
3 పొట్టేళ్ల చోరీ
పెద్దతిప్పసముద్రం : మండలంలోని కందుకూరులో రిజ్వాన్ అనే వ్యక్తికి చెందిన రూ.50 వేల విలువ చేసే మూడు పొట్టేళ్లను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకెళ్లారు. తేరు బజారు సమీపంలోని ఓ ఇంట్లో వదిలిన పొట్టేళ్లను దొంగలు శుక్రవారం అర్ధరాత్రి అనంతరం తాళాలు పగులగొట్టి ఎత్తుకెళ్లారు. బాధితుడు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలంతోపాటు సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
గ్రూప్–2 ఫలితాల్లో ప్రతిభ
చౌడేపల్లె : పుంగనూరు పట్టణంలోని సూర్య నగర్‌లో నివాసమున్న వి.సహదేవన్, కళావతిల కుమార్తె వి.అశ్వని ఏపీపీఎస్సీ గ్రూఫ్–2 ఫలితాల్లో ప్రతిభ కనబరిచారు. అమరావతిలోని ఆంధ్రరాష్ట్ర సచివాలయంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్(రాష్ట్ర పరిపాలనా విభాగం) పోస్టుకు ఎంపికయ్యారు. 2018లో గ్రూప్–3లో పంచాయతీ కార్యదర్శిగా ఎంపికై చౌడేపల్లె మండలం కాటిపేరిలో విఽధులు నిర్వహిస్తున్నారు. 2023లో గ్రూప్–1 పరీక్షలో ఇంటర్వ్యూ వరకు వెళ్లి వెనుతిరిగినప్పటికీ పట్టుదలతో విజయం సాధించినట్లు చెప్పారు. తన భర్త వెంకటేష్ ప్రోత్సాహం, కుటుంబ సభ్యులతోపాటు ఎంపీడీఓ లీలామాధవి, వెంగమునిరెడ్డిల సహకారంతోనే ఈ విజయం సాధించానని అశ్వని తెలిపారు.


