రిజిస్ట్రేషన్‌ మరింత భారం! | - | Sakshi
Sakshi News home page

రిజిస్ట్రేషన్‌ మరింత భారం!

Feb 2 2026 7:32 AM | Updated on Feb 2 2026 7:32 AM

రిజిస్ట్రేషన్‌ మరింత భారం!

రిజిస్ట్రేషన్‌ మరింత భారం!

కుప్పకూలిన వ్యాపారాలు

రాయచోటి: సంపద సృష్టిస్తాం అంటూ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. ఇష్టానుసారంగా ధరలు పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తోంది. తాజాగా రిజిస్ట్రేషన్‌ చార్జీలను మరోసారి పెంచి జనం నెత్తిన బండ మోపేందుకు సిద్ధమైంది. ఇందుకోసం స్థిరాస్తుల మార్కెట్‌ విలువలు సవరించేందుకు స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖకు అనుమతి ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పెంచిన చార్జీల ను అమలు చేయాలంటూ అర్బన్‌ కేంద్రాలలో ఉన్న సబ్‌ రిజిస్ట్రర్‌ కార్యాలయాలకు ఆదేశాలు అందాయి. ఈ మేరకు సోమవారం నుంచి పెంచిన మార్కెట్‌ విలువల ప్రకారం రిజిస్ట్రేషన్లు చేయనున్నారు. ఇప్పటికే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం నేలకూలింది.. పెంచిన చార్జీలతో మరింత దిగజారుతుందని రియల్‌ ఎస్టేట్‌ రంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఏడాది కిందటే 50 శాతం పెంపు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటిలో 50 శాతం మేర పెంచిన విషయం తెలిసిందే. మిగిలిన నియోజకవర్గాలలో కూడా 15 నుంచి 30 శాతం వరకు భూముల విలువలను పెంచారు. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రియల్‌ ఎస్టేట్‌ రంగం కుప్పకూలడంతో పాటు ఇతర వ్యాపారాలు కూడా భారీగా పతనమయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం రెండో విడతగా భూముల విలువ పెంచడం వ్యాపారులకు కొనుగోలుదారులకు మరింత భారంగా మారింది. జిల్లాల మార్పు విషయంలో ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల కారణంగా అన్నమయ్య జిల్లాలోని నియోజకవర్గాలను వారి ఇష్టాను రీతిన బదలాయించడం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపార రంగానికి మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా తయారైంది.

● కాగా అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లిలో 0 నుంచి 50 శాతం, రాయచోటి 10, బి.కొత్తకోట 15 నుంచి 20 శాతం, పుంగనూరు 10 నుంచి 15, పీలేరు 10 నుంచి 20 శాతం, లక్కిరెడ్డిపల్లి 10 నుంచి 15 శాతం మేర పెరిగిన భూముల విలువల ప్రకారం రిజిస్ట్రేషన్‌ చార్జీల చెల్లించాల్సి ఉంటుంది.

ఫిబ్రవరి 1 నుంచి అమలు

పెంచిన భూముల మార్కెట్‌ విలువలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చాయని జిల్లా రిజిస్ట్రార్‌ మూర్తి తెలిపారు. అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లిలో సున్నా నుంచి 50 శాతం మేరకు భూముల వివరాలు పెరిగాయన్నారు. రాయచోటిలో గత ఏడాది 50 శాతం మేర పెంచిన ధరల దృష్ట్యా ప్రస్తుతం 0 నుంచి 10 శాతం వరకు మాత్రమే పెంచామన్నారు. ఈ పెంపుతో స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ విభాగం ద్వారా ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశం ఉందన్నారు.

అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీల ముసుగులో మార్కెట్‌ విలువల సవరణతో వ్యాపారరంగం పాతాళానికి పడిపోయింది. అన్నమయ్య జిల్లా పరిధిలో ఇప్పటికే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలు కనిపించకుండా పోయా యి. ఈ వ్యాపారాల ప్రభావంతో భవన నిర్మాణాలు భారీగా తగ్గిపోయాయి. తద్వారా వేల మంది ఉపాధిని కోల్పోతున్నారు. వీటికి అనుబంధంగా ఉన్న సిమెంట్‌ కడ్డీలు ఇటుకలు, ఇసుక రాళ్లకు తగిన డిమాండ్‌ లేకపోవడంతో వాటి వ్యాపారులు కూడా ఉసూరుమంటున్నారు.

జిల్లా కదలిక మార్పులతో పాతాళానికి పడిపోయిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం

చార్జీల పెంపుతో రియల్‌ ఢమాల్‌

గత ఏడాది రాయచోటిలో 50 శాతం పెంపు

నేడు మదనపల్లి 0 నుంచి 50 శాతం పెంపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement