వన్యప్రాణులను వేటాడితే కఠిన చర్యలు | - | Sakshi
Sakshi News home page

వన్యప్రాణులను వేటాడితే కఠిన చర్యలు

Jan 31 2026 6:39 AM | Updated on Jan 31 2026 6:39 AM

వన్యప్రాణులను వేటాడితే కఠిన చర్యలు

వన్యప్రాణులను వేటాడితే కఠిన చర్యలు

పీలేరు : వన్యప్రాణులను వేటాడితే కఠిన చర్యలు తప్పని సబ్‌ డివిజనల్‌ ఫారెస్ట్‌ ఆపీసర్‌ ఎస్‌. శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం స్థానిక ఫారెస్‌ కార్యాలయంలో ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ గత నెల 5వ తేదీన అలుగును వేటాడి అలుగు చిప్పలను విక్రయిస్తున్న ఏడుగురు నిందితులను అరెస్ట్‌ చేసి జైలుకు పంపినట్లు తెలిపారు. కేవీపల్లె మండలానికి చెందిన రెడ్డెప్ప ప్రధాన సూత్రధారి అన్నారు. ఆయన స్థానికంగా ఉన్న యానాదులు డబ్బు ఆశతో అడవి జంతువులను వేటాడి వాటి మాంసం, ఇతర భాగాలు అక్రమంగా రెడ్డెప్పకు విక్రయిస్తున్నట్లు తేలిందన్నారు. ఆయన ద్వారా అంతర్జాతీయ కొనుగోలుదారులను కూడా గుర్తించి అరెస్ట్‌ చేయడానికి డీఆర్‌ఐ ముంబై అధికారులతో కలసి ఇన్వెస్టిగేషన్‌ చేస్తున్నట్లు తెలిపారు. అటవీచట్టం 1972 ప్రకారం అటవీ జంతువులను వేటాడినా, అటవీ సంపదను దోచుకున్న కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బెయిల్‌ కూడా లేకుండా కనీసం ఏడు సంవత్సరాల జైలు శిక్ష ఉంటుందని తెలిపారు. అటవీ సంపద నాశనం చేయడం ద్వారా వాతావరణ సమతుల్యత దెబ్బతింటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్‌ అధికారులు పాల్గొన్నారు.

సబ్‌ డివిజనల్‌ ఫారెస్ట్‌ ఆపీసర్‌ ఎస్‌. శ్రీనివాసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement