మల్లయ్యకొండను సందర్శించిన మైనింగ్‌ ఏడీ | - | Sakshi
Sakshi News home page

మల్లయ్యకొండను సందర్శించిన మైనింగ్‌ ఏడీ

Feb 7 2026 9:51 AM | Updated on Feb 7 2026 9:51 AM

మల్లయ

మల్లయ్యకొండను సందర్శించిన మైనింగ్‌ ఏడీ

మల్లయ్యకొండను సందర్శించిన మైనింగ్‌ ఏడీ

సాక్షి కథనాలపై స్పందన

తంబళ్లపల్లె: ‘సాక్షి’ దినపత్రికలో గత నెలలో ‘మల్లయ్యకొండపై మైనింగ్‌ బాబుల కన్ను’ శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె మండలంలోని మల్లయ్యకొండను శుక్రవారం మైనింగ్‌శాఖ ఏడీ రంగకుమార్‌, అధికారులతో కలిసి సందర్శించారు. కొండపై ప్రముఖ స్థలాలను, వ్యూ పాయింట్‌ను పరిశీలించారు. ఈ కొండ చుట్టు పక్కల గ్రామాలు, వ్యవసాయ అధారం, నీటి వనరులు, భౌగోళిక స్థితులను అడిగి తెలుసుకున్నారు. పత్రికల్లో వచ్చిన కథనాలపై వివరాలు తెలుసుకునేందుకే మల్లయ్యకొండకు వచ్చినట్లు ఆయన తెలిపారు. తిరుగు ప్రయాణంలో మల్లయ్యకొండ కింద అన్నదాన ట్రస్టు చైర్మన్‌ రాజశేఖర్‌రెడ్డి, కమిటీ సభ్యులు ఏడీని నిలిపి మల్లయ్యకొండ చరిత్ర, అన్నదాన ట్రస్టు అభివృద్ధి, కోట్లాది మంది భక్తుల మనోభావాలను వివరించారు. మైనింగ్‌కు అనుమతి ఇవ్వరాదని, చుట్టు పక్కల మూడు,నాలుగు జిల్లాలు దెబ్బతినే అవకాశం ఉందని వివరించారు. ఇప్పటికీ ప్రజల్లో పలు అనుమానాలు ఉన్నాయని ఏడీ దృష్టికి తెచ్చారు. ఆయన స్పందిస్తూ ఆలయం సందర్శన కోసం వచ్చానని, మైనింగ్‌ అనుమతి ఇచ్చే స్థాయి ఉన్నతాధికారులపై ఉంటుందని తనకు ఎలాంటి సంబంధం ఉండదని తెలిపారు. ఆయన వెంట స్థానిక ఆర్‌ఐ ముద్దుకృష్ణ, మండల సర్వేయర్‌ నాగరాజు, వీఆర్‌ఓ నాగరాజు, రెవిన్యూ సిబ్బంది ఉన్నారు.

మల్లయ్యకొండను సందర్శించిన మైనింగ్‌ ఏడీ 1
1/1

మల్లయ్యకొండను సందర్శించిన మైనింగ్‌ ఏడీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement