లూర్దుమాత తిరునాలకు ఘనంగా ఏర్పాట్లు
కడప సెవెన్‌రోడ్స్ : కడప మరియాపురంలో లూర్దుమాత తిరునాలను ఫిబ్రవరి 10, 11 తేదీల్లో నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశామని ఫాదర్ ఈరి మరియన్న తెలిపా రు. శనివారం లూర్దుమాత చర్చి ప్రాంగణంలో ఆయన మాట్లాడారు. 1936లో రెవరెండ్ ఫాదర్ ఫ్రాన్సిస్ క్రంబ్లిష్ ఈ చర్చిని నిర్మించారని పేర్కొన్నారు. అప్పటి నుంచి ఏటా లూర్దుమాత తిరునాల నిర్వహిస్తున్నామన్నారు. తిరునాల కమిటీ అధ్యక్షుడు జి.బాలయ్య ఫిబ్రవరి 11వ తేదీ నిర్వహించనున్న కార్యక్రమాల గురించి వివరించారు. కమిటీ ప్రధాన కార్యదర్శి వారాధి జోసెఫ్ మాట్లాడుతూ ఫిబ్రవరి 2న సాయంత్రం 5.30 గంటలకు పతాకావిష్కరణతో తిరునాల ప్రారంభిస్తామన్నారు. నవదిన పూజలు ఉంటాయన్నారు. 10న డాన్‌బాస్కో ఐటీఐ నుంచి లూర్దుమాత ఊరేగింపు మరియాపురం వరకు సాగుతుందన్నారు. 11న కడప మేత్రాసన పీఠాధిపతులు సగినాల పాల్‌ప్రకాశ్ పూజలు నిర్వహిస్తారన్నారు. వివిధ పోటీలు ఉంటాయని వివరించారు. ఈ సందర్భంగా లూర్దుమాత తిరునాల మహోత్సవానికి సంబంధించి కరదీపికలు ఆవిష్కరించారు.
ఫిబ్రవరి 10, 11 తేదీల్లో నిర్వహణ
ఫాదర్ ఈరి మరియన్న


