భారీగా నష్టపోయా
గత ఏడాది నవంబరు నెలలో దుక్కి చేసి నారు నాటి, కర్రలు కట్టి, ఎరువులు వేసి నాలుగు ఎకరాల్లో టమాట పంట సాగు చేశాను. పెట్టుబడిగా రూ.11 లక్షల వరకు ఖర్చు చేసి పంటను సాగు చేశాను. గత జనవరిలో పంట చేతికి రాగా 15 కిలోల ట్రే ధర రూ.100 పలికింది. దూర ప్రాంతాల మార్కెట్‌కు తరలిస్తే కనీసం వాహన అద్దె, కూలీలకు సరిపోదు. నేడు మరీ దారుణంగా బాక్సు రూ.20కు కూడా కొనేవారు లేరు. టమాట సాగు చేసి రూ. 5 లక్షల వరకు నష్టపోయాను. – టీఎస్ సుహైల్‌బాషా, రైతు, కలకడ
వ్యవసాయం దండగ అనిపిస్తోంది
అప్పు చేసి పెట్టుబడులు పెట్టడం, అర్ధరాత్రి వరకు కాపలా, ఇంటిల్లిపాది కష్టపడితే నేడు కొనుగోలు చేసేవారు లేరు. తోటపై వదిలేస్తే ఉన్న చెట్టుకు నష్టం వాటిల్లుతుంది. మార్కెట్‌కు తరలించాలన్నా వాహనాల అద్దె, ఇతర ఖర్చులు రావడం లేదు. పంట సాగు కోసం చేసిన రూ.2 లక్షల అప్పు అలాగే ఉంది. పరిస్థితులు గమనిస్తే వ్యవసాయమే దండగ అనిపిస్తోంది. కష్టానికి తగ్గ కూలి కూడా మిగలడం లేదు.
– మద్దిపట్ల సిద్దయ్యనాయుడు, రైతు, కలకడ మండలం
భారీగా నష్టపోయా


