ఆత్మహత్యలకు ప్రేరేపించే విధంగా పనిభారం
నాటి కొఠారి కమిషన్ నుంచి నేటి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వరకు ఏ కమిషనైనా ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయాలని చెప్పినా ప్రభుత్వం మారడం లేదు. ఉపాధ్యాయులను రకరకాల యాప్‌లతో, వెబ్ కాన్ఫరెన్స్‌లతో, రిపోర్టులతో ఉపాధ్యాయులను బోధనేతర పనులతో ఒత్తిడి పెంచి ఆత్మహత్యకు ప్రేరేపిస్తోంది. ఇప్పటికై నా ఉపాధ్యాయులను ప్రశాంత వాతావరణంలో విద్యార్థులతో మమేకమై బోధించే వాతావరణాన్ని కల్పించాలి. అలాగే బోధనేతర పనులకు ప్రభుత్వం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి.
– లెక్కల జమాల్ రెడ్డి, ప్రగతిశీల రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు.


