ఎఫ్‌ఎన్‌హెచ్‌డబ్ల్యూతో జీవన ప్రమాణాలు పెంపు
మదనపల్లె రూరల్: మహిళా స్వయంసహాయక బృందాల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు దీనదయాళ్ అంత్యో దయ యోజన–నేషనల్ రూరల్ లైవ్లీ హుడ్స్ మిషన్ చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమమే ఆహారం, పోషణ, ఆరోగ్యం, వాష్ (ఎఫ్‌ఎన్‌హెచ్‌డబ్ల్యూ) అని డీఆర్‌డీఏ పీడీ నాగేశ్వరరావు తెలిపారు. శనివారం మదనపల్లె మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో 15 మండలాలకు చెందిన వెలుగు ఏపీఎం, సీసీలకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎఫ్‌ఎన్‌హెచ్‌డబ్ల్యూ ద్వారా కేవలం జీవనోపాధి కల్పన మాత్రమే కాకుండా ఆరోగ్యం, పారిశుధ్యంపై అవగాహన పెంచి, కుటుంబాల ఆరోగ్యాన్ని పెంచడమే లక్ష్యమన్నారు. కార్యక్రమంలో భాగంగా స్వయంసహాయక బృందాల సభ్యు లు, కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లు ఇంటింటికీ వెళ్లి గ్రామ సమావేశాల్లో అవగాహన కల్పించాలన్నారు. ఐసీడీఎస్ ప్రాజెక్టులో మహిళలకు అందుతున్న సంక్షేమ పథకాలు, మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి బిడ్డ పుట్టిన రెండేళ్ల వరకు వేయి రోజుల కార్యక్రమం, గ్రామాల్లో తాగునీటి సరఫరా, పారిశుధ్యం, కిచెన్ గార్డెన్, సేంద్రియ వ్యవసాయం పథకాల్లో మహిళల పాత్రపై వివరించారు. సీడీపీఓ నాగవేణి, డీపీఎం ధర్మరాజు, ఏపీఎం ఖిజర్ హయత్ ఖాన్ పాల్గొన్నారు.
డీఆర్‌డీఏ పీడీ నాగేశ్వరరావు


