ప్రాణం తీసిన ఇన్‌స్టా రీల్స్‌ మోజు | - | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన ఇన్‌స్టా రీల్స్‌ మోజు

Feb 6 2026 7:43 AM | Updated on Feb 6 2026 7:43 AM

ప్రాణం తీసిన ఇన్‌స్టా రీల్స్‌ మోజు

ప్రాణం తీసిన ఇన్‌స్టా రీల్స్‌ మోజు

వల్లూరు(చెన్నూరు) : రీల్స్‌ ఫిచ్చి రోజు రోజుకూ పెరిగిపోతోంది. సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసే రీల్స్‌కు ఎక్కువ వ్యూస్‌, లైక్‌లు ఆశిస్తున్న వారు తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి రీల్స్‌ చేస్తున్నారు. అయితే తాము రీల్స్‌ మోజులో చేసే విన్యాసాల వలన ప్రమాదాల బారిన పడి తమ ప్రాణాలు కోల్పోతున్న యువత తల్లిదండ్రులకు తీరని కడుపు కోతను మిగుల్చడమే కాక ఇతరులకు కూడా ఇబ్బందులు కలగిస్తున్నారు. వైఎస్సార్‌ కడప జిల్లా కడప– తాడిపత్రి ప్రధాన రహదారిపై కడప విమానాశ్రయం సమీపంలో చెన్నూరు మండల పరిధిలోని శాటిట్‌ సిటీ వద్ద బుదవారం తెల్లవారుజామున జరిగిన సంఘటన ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. కడప పట్టణంలోని రవీంద్రనగర్‌కు చెందిన సయ్యద్‌ ముబారక్‌ అనే యువకుడు తన స్నేహితుడైన లతీఫ్‌తో కలిసి బైక్‌లో బయలు దేరారు. ఇన్‌స్టా రీల్స్‌ కోసం విమానాశ్రయం సమీపంలో రోడ్డుపై బైక్‌తో విన్యాసాలు చేస్తూ అదుపు తప్పి కింద పడడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స కోసం 108 వాహనంలో కడప రిమ్స్‌కు తరలించగా ముబారక్‌ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. తీవ్రంగా గాయపడిన లతీఫ్‌ చికిత్స పొందుతున్నాడు.

కొద్ది రోజుల క్రితం కడప – మైదుకూరు రోడ్డులో చెన్నూరు వద్ద పలువురు యువకులు పట్టపగలే బైక్‌ విన్యాసాలు చేశారు. ఇవి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. తర్వాత కూడా పలువురు యువకులు తల్లిదండ్రులకు తెలియకుండా ఇంటి నుంచి బయటకు వచ్చి ఇలా బైక్‌ విన్యాసాలు చేస్తూ హల్‌చల్‌ చేయడం రివాజుగా మారింది. పోలీసులు ఇలాంటివాటిని చూసీ చూడనట్లు వ్యవహరించడం వారికి అలుసుగా మారుతోంది. పోలీసులు ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా వుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఎక్కడికి వెళ్లారు, ఏం చేస్తున్నారో గమనిస్తూ వారిని అదుపుచేసి సక్రమ మార్గంలో నడిచేలా చూడాల్సిన అవసరం వుంది. లేక పోతే తీవ్రంగా నష్టపోవాల్సి వుంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement