శభాష్.. సురేష్ !
● 9 ఏళ్ల నుంచి మంచంపైనే ..
● ఇంట్లోనే ఉంటూ ప్రిపేరై
గ్రూప్–2కు ఎంపిక
ప్రొద్దుటూరు : ఒకటి ..రెండు కాదు.. తొమ్మిదేళ్లుగా మంచానికే పరిమితమైన మోతుకూరి సురేష్‌బాబు గ్రూప్–2 పరీక్షా ఫలితాల్లో విజయం సాధించి శభాష్ అనిపించాడు. ప్రొద్దుటూరు పట్టణంలోని వసంతపేట వీధికి చెందిన సురేష్‌బాబు 2016లో ఆటో ఇమ్యూ న్ డిజార్డర్‌తో మంచానికే పరిమితమయ్యా డు. అనేక చోట్ల ఆస్పత్రులకు తిరిగినా ఫలితం లేకుండా పోయింది. అప్పటి నుంచే మంచానికే పరిమితమైన సురేష్‌బాబు 2018లో గ్రూప్–2 రాసినా ఉద్యోగం సాధించలేకపోయాడు. ఈసారి ఈసారి పట్టు వదలని విక్రమార్కుడిలా అకుంఠిత దీక్షతో చదివాడు. ప్రస్తుతం సురేష్‌బాబు గ్రూప్–2 ఫలితాల్లో ఏపీ సెక్రటరీయేట్‌లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌గా ఉద్యోగం సాధించాడు. పోలియోతో బాధపడుతున్న యూపీఎస్‌సీ ర్యాంకర్ బాలాలత స్ఫూర్తితో రోజుకు ఆరు గంటల పాటు చదివానని సురేష్ సాక్షికి తెలిపారు.


