గాండ్ల కులస్తులు ఐక్యతతో ముందుకు సాగాలి
మదనపల్లె : సమస్యలు, సంక్షేమం విషయంలో గాండ్ల కులస్తులు ఐక్యంగా ముందుకు సాగాలని అఖిల గాండ్ల తెలగ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గ్రోస్ సుబ్బారావు పిలుపునిచ్చారు. ఆదివారం మదనపల్లె మండలం పోతబోలు పంచాయతీ దేవలంబండ వద్ద జిల్లా అధ్యక్షులు బండపల్లి వెంకటరమణ ఆధ్వర్యంలో మాఘమాస వన భోజనాల కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ గాండ్ల కులస్తులకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి, సంక్షేమం, సంఘ అభివృద్ధి జరగాల్సి ఉందన్నారు. వీటిని ఐక్యంగా సాధించుకుంటూ ముందుకు సాగితే మరింత వృద్ధి సాధిస్తామన్నారు. నరేంద్రమోడీ లాంటి నాయకులు తమ కులస్తులు కావడాన్ని గర్వించాలన్నారు. మండలస్థాయి నుంచి సంఘం పురోభివృద్దికి ప్రతిఒక్కరూ సహకరించి పని చేయాలన్నారు. ఈ సభకు ముందుకు స్థానిక చెన్నకేశవస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. గోమాతకు, కులానికి ఆధారమైన గానుగకు పూజలు చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు సురేష్‌బాబు రాజా, సత్యనారాయణ, కొండయ్య, కేవీ.ప్రసాద్, సిటిఎం క్రాస్‌రోడ్డు సర్పంచు బండపల్లి ఈశ్వరమ్మ, పోతబోలు సర్పంచు ఈశ్వరయ్య, శెట్టివారి చంద్ర, కృష్ణప్ప, నారా నరసింహులు, గోపిత, పాలెం నవీన్ పాల్గొన్నారు.
ఏకగ్రీవ ఎన్నిక
మదనపల్లె : మదనపల్లె నియోజకవర్గ గాండ్ల తెలగ సంఘ నూతన అధ్యక్షుడిగా కేవి.ప్రసాద్ బుజ్జిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం మండలంలోని దేవలంబండ వద్ద జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షుడు బండపల్లి వెంకటరమణ ఆధ్వర్యంలో నూతన కమిటి ఎన్నికై ంది. కార్యదర్శిగా సీహెచ్.కృష్ణప్ప, కోశాధికారిగా టి.వెంకటరమణ, ఉపాధ్యక్షుడిగా పి.వెంకటరమణ, సంయుక్త కార్యదర్శిగా బి.కేశవ, జి.వెంకటరమణ, కార్యానిర్వహక కార్యదర్శిగా టి.కేశవ, కార్యవర్గ సభ్యులుగా వండాడి బాబు చెన్నకేశవులు, ఎన్.శ్రీనివాసులు, టి.నవీన్, పి.కృష్ణప్ప, కే.నాగరాజు, సి.కృష్ణప్ప, జి.బాబు ప్రసాద్, నరసింహులును ఎన్నుకున్నారు.
రాష్ట్ర అధ్యక్షుడు గ్రోస్ సుబ్బారావు
గాండ్ల కులస్తులు ఐక్యతతో ముందుకు సాగాలి


