దివ్యాంగ క్రీడాకారులను ప్రోత్సహించాలి | - | Sakshi
Sakshi News home page

దివ్యాంగ క్రీడాకారులను ప్రోత్సహించాలి

Feb 6 2026 7:43 AM | Updated on Feb 6 2026 7:43 AM

దివ్యాంగ  క్రీడాకారులను ప్రోత్సహించాలి

దివ్యాంగ క్రీడాకారులను ప్రోత్సహించాలి

కడప కోటిరెడ్డిసర్కిల్‌ : వైఎస్సార్‌ క్రికెట్‌ స్టేడియంలో ఈనెల 12 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించబోయే దక్షిణ మండల క్రికెట్‌ టోర్నమెంట్‌కు హాజరు కావాలని ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ కె.శ్రీనివాసమూర్తిని కడపజిల్లా దివ్యాంగుల క్రికెట్‌ సంఘం కార్యదర్శి మనోహర్‌రాజు, డిఫరెంట్లీ ఏబుల్డ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ఎస్‌.మధుసూదన్‌ నాయక్‌లు ఆహ్వానించారు. ఈ మేరకు గురువారం శ్రీనివాసమూర్తిని ఆయన కార్యాలయంలో కలిశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ దక్షిణ మండల క్రికెట్‌ టోర్నమెంట్‌కు హాజరయ్యే దివ్యాంగ క్రీడాకారులను ప్రోత్సహించాలని కోరారు. శ్రీనివాసమూర్తి స్పందిస్తూ దివ్యాంగుల క్రికెట్‌ అభివృద్ధికి సహకారాలు అందిస్తానని తెలియజేశారు.

రిమ్స్‌లో గుర్తు తెలియని మృతదేహం

కడప అర్బన్‌ : కడపలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్‌)కు గుర్తు తెలియని వ్యక్తిని చికిత్సకోసం ఈనెల 4వతేదీన తీసుకొచ్చారు. వచ్చిన కొంతసేపటికే మృతి చెందాడు.మృతదేహాన్ని మార్చురీలో ఉంచారు. తగిన ఆధారాలతో సంప్రదించాలని రిమ్స్‌ అధికారులు తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement