పెస్టిసైడ్స్‌ సరఫరాకు సీల్డ్‌ టెండర్ల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

పెస్టిసైడ్స్‌ సరఫరాకు సీల్డ్‌ టెండర్ల ఆహ్వానం

Feb 5 2026 7:33 AM | Updated on Feb 5 2026 7:33 AM

పెస్టిసైడ్స్‌ సరఫరాకు  సీల్డ్‌ టెండర్ల ఆహ్వానం

పెస్టిసైడ్స్‌ సరఫరాకు సీల్డ్‌ టెండర్ల ఆహ్వానం

పెస్టిసైడ్స్‌ సరఫరాకు సీల్డ్‌ టెండర్ల ఆహ్వానం బి.కొత్తకోట ఎంపీపీ ఎన్నిక నేటికి వాయిదా డీఆర్‌గా ఉమా మహేశ్వరి బాధ్యతల స్వీకరణ ముగిసిన ఇంటర్వ్యూలు జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభ క్యాన్సర్‌పై విజయం.. స్క్రీనింగ్‌తో సాధ్యం

మదనపల్లె రూరల్‌: జిల్లాలోని పట్టు రైతులకు పట్టు పరిశ్రమశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం తరఫున నాణ్యమైన క్రిమిసంహారక మందులు(పెస్టిసైడ్స్‌) సరఫరా కోసం ఉత్పత్తిదారుల నుంచి సీల్డ్‌ టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు జేసీ శివ్‌ నారాయణశర్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 5 నుంచి 12వతేదీ సాయంత్రం 5 గంటలలోపు టెండర్లు వేసేందుకు గడువు విధించామని పేర్కొన్నారు. టెండర్‌ పూర్తి వివరాల కోసం 99661 53900 నెంబర్లో సంప్రదించాలని సూచించారు.

చిత్తూరు కార్పొరేషన్‌: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బుధవారం రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గుడిపాల, బి.కొత్తకోట ఎంపీపీల స్థానాలకు ఎన్నిక నిర్వహించారు. బి.కొత్తకోట ఎంపీపీ స్థానం ఎస్సీ మహిళ కావడంతో, ఎంపీటీసీలు ఎవరూ ఆ కేటగిరీకి చెందిన వారు లేకపోవడంతో పోటీ చేయలేదు. అధికారులు ఎన్నికను గురువారానికి వాయిదా వేశారు. అసలు సమస్యను ఎన్నికల సంఘంకు నివేదించనున్నట్లు తెలుస్తోంది. అలాగే గుడిపాలలో ఎంపీటీసీ జి.హరిప్రసాద్‌ చౌదరి ఎంపీపీగా ఎన్నికై నట్లు అధికారులు ప్రకటించారు.

మదనపల్లె రూరల్‌: అన్నమయ్యజిల్లా డిస్ట్రిక్ట్‌ రిజిస్ట్రార్‌(డీఆర్‌)గా పి.ఉమా మహేశ్వరి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత డిస్ట్రిక్ట్‌ రిజిస్ట్రార్‌ ఏవీఎస్‌.మూర్తి, చిత్తూరుజిల్లా డీఆర్‌గా ఉంటూ డెప్యుటేషన్‌పై అన్నమయ్యజిల్లా బాధ్యతలు నిర్వహించేవారు. హిందూపురం డీఆర్‌గా పనిచేస్తున్న ఉమా మహేశ్వరిని అన్నమయ్యజిల్లా డీఆర్‌గా నియమిస్తూ ప్రభు త్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో రాయచోటిలోని డీఆర్‌ కార్యాలయంలో ఉమా మహేశ్వరి బాధ్యతలు స్వీకరించారు.

మదనపల్లె రూరల్‌: జిల్లా విద్యాశాఖ సమగ్రశిక్షణ విభాగంలో ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న భవిత కేంద్రాల్లో తాత్కాలిక పద్ధతిపై ఫిజియోథెరపిస్టులుగా సేవలందించేందుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కలెక్టరేట్‌లో బుధవారం ఇంటర్వ్యూలు నిర్వహించారు. సమగ్ర శిక్ష జిల్లా కమ్యూనిటీ మొబిలైజింగ్‌ కో–ఆర్డినేటర్‌ జనార్దన్‌ మాట్లాడుతూ జిల్లాలోని 5 ఫిజియోథెరపిస్ట్‌ ఖాళీలకు మొత్తం 35మంది దరఖాస్తు చేసుకోగా, 28 మంది అభ్యర్థులు ఇంట ర్వ్యూలకు హాజరయ్యారన్నారు. జేసీ శివ్‌ నారాయణ శర్మ, డీఈఓ సుబ్రహ్మణ్యం, సమగ్రశిక్షా ఏపీసీ అనూరాధ, డీఎంహెచ్‌ఓ లక్ష్మీనరసయ్య ఇంటర్వ్యూ నిర్వహించారన్నారు.

కేవీపల్లె: మండలంలోని గ్యారంపల్లె కొత్తపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయి హ్యాండ్‌ బాల్‌ పోటీల్లో ప్రతిభ చూపినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి.సరస్వతి తెలిపారు. హ్యాండ్‌ బాల్‌ క్రీడలో రాణించిన విద్యార్థులను బుధవారం పాఠశాలలో అభినందించారు. అండర్‌ 14 విభాగంలో తమ పాఠశాల నుంచి రాహుల్‌, సోహిత్‌రెడ్డి, విహాన్‌, దీక్ష జిల్లా జట్టుకు ఎంపికయ్యారని తెలిపారు. అండర్‌ 17 విభాగంలో తమ పాఠశాల నుంచి మహేంద్ర, ఓంప్రకాష్‌, లోకేష్‌కుమార్‌నాయక్‌, లక్ష్మీ, మహిత కర్ణాటకలో జరిగిన అంతరాష్ట్ర పోటీల్లో పాల్గొని ప్రతిభచూపినట్లు వివరించారు.

మదనపల్లె అర్బన్‌: క్యాన్సర్‌పై విజయం స్క్రీనింగ్‌తో సాధ్యమవుతుందని డీఎంహెచ్‌వో డాక్టర్‌ లక్ష్మీనరసయ్య పేర్కొన్నారు. బుధవారం ప్రపంచ క్యాన్సర్‌ నివారణ దినోత్సవం సందర్భంగా స్థానిక డీఎంహెచ్‌వో కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ లక్ష్మీనరసయ్య మాట్లాడుతూ ఆరోగ్యకర జీవనశైలి, ప్రవర్తనతో క్యాన్సర్‌ను నియంత్రించవచ్చన్నారు. ఎన్‌సీడీ ప్రోగ్రాం జిల్లా అధికారి శివప్రతాప్‌ , హెల్త్‌ఎడ్యుకేటర్‌ మహ్మద్‌రఫీ మాట్లాడారు. అనంతరం వైద్య సిబ్బందితో కలసి పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం క్యాన్సర్‌ను నియంత్రిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో క్షయనివారణ జిల్లా అధికారి డాక్టర్‌ రాధిక, ఏవో మధుసూదన్‌రెడ్డి, 104నోడల్‌ అధికారి శ్రీధర్‌, డీఎంవో రామచంద్రారెడ్డి, వైద్యసిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement