పోలీసుల సంక్షేమానికి ప్రాధాన్యత
రాయచోటి : శాంతి భద్రతలతోపాటు వాటిని పర్యవేక్షించే పోలీసుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పేర్కొన్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఏఆర్ మొబిలైజేషన్ సందర్భంగా గురువారం రాయచోటి ఏరియా ఆసుపత్రిలో ఏఆర్ పోలీసులకు సమగ్ర ఆరోగ్య పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు. జిల్లా పోలీసు యంత్రాంగం, సిబ్బంది సంక్షేమం దిశగా మరో ముందడుగు వేయడం అభినందనీయమన్నారు. సిబ్బందికి భరోసా ఇస్తూ ఎస్పీ పలు సూచనలు చేశారు. ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా మెడికల్ చెకప్ చేయించుకోవాలన్నారు. సమాజానికి మెరుగైన సేవలు అందించాలన్నారు. అనంతరం ఆసుపత్రి సూపరిటెండెంట్ డాక్టర్ డి.లక్ష్మీప్రసాద్‌తో కలిసి ఏఆర్ డీఎస్పీ ఏడు కొండలరెడ్డి వైద్య శిబిరాన్ని పర్యవేక్షించారు. ఎస్పీ ఆదేశాల మేరకు ప్రతి పోలీసు అధికారి హెల్త్ ప్రొఫైల్‌ను ట్రాక్ చేస్తున్నామని, విధి నిర్వహణలో అలసత్వానికి తావులేకుండా సిబ్బందిని మానసికంగా, శారీరకంగా సిద్ధం చేస్తున్నట్లు డీఎస్పీ కృష్ణమోహన్ తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ రామరాజు, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ వీజే రామకృష్ణ, ఆర్‌ఎస్‌ఐ జి రవి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి


