హత్యరాల ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

హత్యరాల ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు

Feb 5 2026 7:33 AM | Updated on Feb 5 2026 7:33 AM

హత్యరాల ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు

హత్యరాల ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు

హత్యరాల ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు

రాజంపేట: చెయ్యేరు నదీ ఒడ్డున వెలసిన పవిత్ర పుణ్యక్షేత్రం హత్యరాల త్రేతేశ్వరస్వామి మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను పకడ్బందీగా చేస్తున్నామని రాజంపేట సబ్‌కలెక్టర్‌ సీహెచ్‌ భావన అన్నారు. బుధవారం అన్నమయ్య సభాభవనంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. హత్యరాల ఉత్సవాలకు రాజంపేట పరిసర ప్రాంతాలే కాకుండా తిరుపతి, కడప జిల్లా నలుమూలల నుంచి వేలాది సంఖ్యలో భక్తులు తరలివస్తారన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఏఎస్పీ మనోజ్‌రామ్‌నాథ్‌హెగ్డే మాట్లాడుతూ ఉత్సవాలకు గట్టి పోలీసు బందోబస్తు నిర్వహిస్తామన్నారు.సబ్‌కలెక్టరేట్‌ పరిపాలనాధికారి శ్రీధర్‌, ఎంవీఐ వినోద్‌కుమార్‌, డీఈఈ సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.

రాజంపేట సబ్‌కలెక్టర్‌

సీహెచ్‌ భావన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement