రాజా రాణి బొమ్మలకు జీఐ ట్యాగ్‌కు ప్రయత్నం
14,15 తేదీల్లో హెడ్‌మాస్టర్ అకౌంట్ టెస్టు
మదనపల్లె సిటీ: పదో తరగతి పరీక్షల్లో వసతిగృహంలో చదువుతున్న విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారి దామోదర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక నక్కలదిన్నెలోని ఎస్సీ బాలుర సంక్షేమ వసతి గృహంలో జిల్లాలోని సహాయ సంక్షేమశాఖ అధికారులు, వార్డెన్లతో సమీక్షా సమావేశం జరిగింది. పరీక్షలు దగ్గరపడుతున్నాయని, వార్డెన్లు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని సూచించారు. విద్యార్థులకు రెగ్యులర్‌గా పరీక్షలు నిర్వహించాలన్నారు. మెనూ ప్రకారం భోజనం పెట్టాలన్నారు.వసతిగృహాల్లో జరుగుతున్న పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.కార్యక్రమంలో ఎఎస్‌డబ్యూలు గంగిరెడ్డి, శ్రీరాములునాయక్, క్రిష్ణ, వార్డన్లు పాల్గొన్నారు.
కురబలకోట: తిరుపతి జిల్లా లక్ష్మీగారిపల్లి పరిసర ప్రాంతాల్లో శతాబ్దాలుగా విరాజిల్లుతున్న ఎర్రచందనం, ఇతర విలువైన చెక్కలతో తయారు చేసే రాజా–రాణి బొమ్మల కళకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకు వచ్చే దిశగా అడుగులు పడుతున్నాయి. మదనపల్లె సమీపంలోని అంగళ్లులో ఉన్న మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ పరిధిలోని మిట్స్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఫెసిలిటేషన్ సెంటర్ (మిట్స్– ఐపీఎఫ్‌సీ) ఈ సంప్రదాయ కళకు భౌగోళిక సూచిక (జీఐ) ట్యాగ్ కోసం చైన్నె జీఐ రిజిస్ట్రీకి అధికారికంగా ధరఖాస్తు చేసినట్లు వీసీ సి. యువరాజ్ శుక్రవారం తెలిపారు. లక్ష్మీగారిపల్లి, సెట్టిగుంట పరిసర ప్రాంతాల్లోని రాజా–రాణి బొమ్మలు ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందాయన్నారు. శ్రీ లక్ష్మీ వెంకటే శ్వర ఆర్టి స్టిక్ వుడెన్ టాయ్స్ వర్కర్స్ ఇండిస్ట్రియల్ కో ఆపరేటివ్ సొసైటీ పేరిట ఈ దరఖాస్తు దాఖలు చేసిన ట్లు తెలిపారు. దీని ద్వారా స్థానిక కళాకారులకు ఆర్థిక భధ్రతతో పాటు వారి కృషికి, కళకు చట్టబద్ధత లభించగలదని మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ చాన్స్‌లర్ డాక్టర్ నాదేళ్ల విజయభాస్కర్ చౌదరి తెలిపారు. మిట్స్ ఆర్ అండ్‌డీ డాక్టర్ తులసీరామ్ నాయుడు, పి. శివయ్య ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు.
మదనపల్లె సిటీ: హెడ్‌మాస్టర్ అకౌంట్ టెస్టు ఫిబ్రవరి 14,15 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్ణయించిన పరీక్షా కేంద్రాల్లో జరగనుంది. ఈ విషయాన్ని డీఈఓ సుబ్రమణ్యం తెలిపారు. ఫ్రొఫెసనల్ అడ్వాన్స్‌మెంట్ టెస్టు 14వతేదీ రెండు పూటలా జరుగుతుందన్నారు. వివరాలకు www.bs.ap.gov.in వెబ్‌సైట్ చూడాలని ఆయన కోరారు.
రాజా రాణి బొమ్మలకు జీఐ ట్యాగ్‌కు ప్రయత్నం


