మహిళ ఆత్మహత్యాయత్నం
మదనపల్లె అర్బన్ : తీవ్రమైన కడుపునొప్పి భరించలేక మనస్తాపం చెందిన ఓ మహిళ క్రిమిసంహారక మందుతాగి ఆత్మహత్యకు యత్నించింది. తంబళ్లపల్లె మండలం కుక్కరాజుపల్లెకు చెందిన నాగరత్నమ్మ(44) కూలీ పనులు చేస్తుండేది. ఈ నేపథ్యంలో ఈమె కొద్ది రోజులుగా కడుపునొప్పితో బాధపడుతోంది. అయితే శనివారం నొప్పి అధికం కావడంతో మనస్తాపం చెంది క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన కుటుంబీకులు బాధితురాలిని 108 వాహనంలో మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు.
కోడి పందెం స్థావరంపై దాడులు
వాల్మీకిపురం : మండల పరిధిలోని తాటిగుంటపల్లి సమీపంలో కోడి పందెం స్థావరంపై పోలీసు లు శనివారం దాడులు నిర్వహించారు. ఓ మామి డి తోటలో కోడి పందెం ఆడుతున్న 16 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.1,80,270 నగదు, 14 సెల్‌ఫోన్లు, నాలుగు కార్లు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడుల్లో ఎస్‌ఐ తిప్పేస్వామితోపాటు సిబ్బంది పాల్గొన్నారు.
యువతి అదృశ్యం
బి.కొత్తకోట : స్థానిక బీసీ కాలనీకి చెందిన యువతి అదృశ్యమైందని తండ్రి ఫి ర్యాదుపై కేసు నమోదు చేసినట్టు శనివారం పోలీసులు తెలిపారు. కూలీ పనులతో జీవిస్తున్న మహ్మద్ హుస్సే న్ సాబ్ కుమార్తె అర్షియా (18) ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఇంటి వద్దనే ఉంటోంది. ఈ నెల 5న ఇంటి నుంచి వెళ్లిన అర్షియా తిరిగి రాలేదు. ఆచూకీ కోసం వెతికినా కనిపించకపోవడంతో తండ్రి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.


