పీఆర్సీ కమిషన్‌ను నియమించాలి | - | Sakshi
Sakshi News home page

పీఆర్సీ కమిషన్‌ను నియమించాలి

Feb 6 2026 7:43 AM | Updated on Feb 6 2026 7:43 AM

పీఆర్సీ కమిషన్‌ను నియమించాలి

పీఆర్సీ కమిషన్‌ను నియమించాలి

మదనపల్లె సిటీ : ప్రభుత్వ, ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించి 12వ పీఆర్సీ కమిషన్‌ను నియమించి 30 శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలని స్కూల్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు కాడిశెట్టి శ్రీనివాసులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.గురువారం స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో జిల్లా నూతన కమిటీ ఎన్నిక సమావేశానికి ఆయన హాజరయ్యారు. 12వ పీఆర్సీ కాలపరిమితి 2023 జూన్‌ నాటికి ముగిసిందన్నారు. జులై 1,2023 నుంచి 12వ పీఆర్సీ అమలు కావాల్సి ఉండగా రెండున్నరేళ్లు దాటినా నేటికి కనీసం పీఆర్సీ కమిషన్‌ నియమించకపోవడం ఉద్యోగ,ఉపాధ్యాయులు ఆర్థికంగా ఎంతో నష్టపోతున్నారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వెంటనే పీఆర్సీ కమిషన్‌ నియమించి మధ్యంతర భృతి ప్రకటించాలన్నారు. టెట్‌ విషయంలో ఇన్‌ సర్వీసు ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారని, కేంద్ర ప్రభుత్వంలో మాట్లాడి టెట్‌ మినహాయింపు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్‌ఎస్‌సీ వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక సెలవు రోజుల్లో పని చేసిన కాలానికి సీసీఎల్‌ మంజూరు చేయాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి పుల్లయ్య, జిల్లా నాయకులు శివకుమార్‌, అర్జున్‌నాయక్‌, వరప్రసాద్‌, విశ్వనాథ్‌, రమణప్ప, లక్ష్మిరమణ, ప్రతాప్‌నాయక్‌, శ్రీనివాసులు, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement