శివలింగాన్ని తాకిన సూర్య కిరణాలు
రొంపిచెర్ల : రొంపిచెర్ల మండలం బొమ్మయ్యగారిపల్లె గ్రామ పంచాయతీలోని కట్టకింద శివాలయంలో సూర్యకిరణాలు శివలింగాన్ని తాకాయి. గురువారం ఉదయం మాఘస్థానం చేస్తున్న భక్తులు శివాలయంలో పూజలు చేయడానికి వెళ్లారు. అప్పుడు సూర్య కిరణాలు శివలింగంపై పడడం చూశారు. ప్రతి సంవత్సరం శివలింగంపై ఉదయం7 గంటల నుచి 7.20 గంటల మద్య ఈ దృశ్యం కనిపిస్తుంది. ఈ విశేషాన్ని పురస్కరించుకుని ఆలయంలో భక్తులు శివలింగానికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ తంతును భక్తులు సెల్‌ఫోన్లలో వీడియోలు,ఫోటోలు తీసి వాట్సాప్‌లలో ప్రచారం చేశారు.


