నలుగురు అంతర్‌ రాష్ట్ర దొంగల అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

నలుగురు అంతర్‌ రాష్ట్ర దొంగల అరెస్ట్‌

Feb 7 2026 9:53 AM | Updated on Feb 7 2026 9:53 AM

నలుగురు అంతర్‌ రాష్ట్ర దొంగల అరెస్ట్‌

నలుగురు అంతర్‌ రాష్ట్ర దొంగల అరెస్ట్‌

రాయచోటి : బంగారు నగలు, మోటారుబైకుల దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్‌ రాష్ట్ర దొంగల ము ఠాను అన్నమయ్య జిల్లా పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ .10.62 లక్షల విలువ చేసే నగలను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లి తెలిపారు. శుక్రవారం రాయచోటిలోని కార్యాలయంలో ఎస్పీ మీడియాకు వివరాలు వెల్లడించారు. రా యచోటి, రామాపురం మండలాల పోలీసులు సమన్వయంతో పని చేసి రెండు వేర్వేరు ఆపరేషన్లలో అంతర్‌ రాష్ట్ర దొంగల ముఠాలను అరెస్టు చేశారన్నారు. రామాపురం పరిధిలో వరుస చోరీలకు పాల్పడుతున్న దర్సినాల ఏడుకొండలు, పందిటి ఉదయ్‌ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి రూ.10,62,320 విలువ గల 62 గ్రాముల బంగారం, రెండు ద్విచక్రవాహనాలు స్వాధీన పరుచుకున్నట్లు తెలిపారు. అలాగే రాయచోటి బస్టాండ్‌ ప్రాంతంలో ప్రయాణికులను మోసగించి సొత్తు దోచుకుంటున్న జోగిరి వెంకటలక్ష్మి, జోగిరి అంజనమ్మను అరెస్టు చేశామన్నారు. వారి నుంచి లాంగ్‌ చైన్‌, చోకర్‌ కమ్మలు, నెక్లెస్‌లను రికవరీ చేసినట్లు వివరించారు. బంగారు ఆభరణాల విషయంలో ప్రజలు స్వయం రక్షణ పా టించాలని ఎస్పీ సూచించారు. బస్టాండ్‌, రైల్వేస్టేషన్ల లో విలువైన ఆభరణాలు పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి వ్యాపారి సంస్థ, ఇళ్ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం వల్ల నేరస్తులను త్వరగా పట్టుకోవచ్చని తెలియపరిచారు. మీ వీధి లేదా పరిసరాలలో కొత్త వ్యక్తులు అనుమానస్పదంగా కనిపిస్తే వెంటనే 112కు డయల్‌ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. నేరస్తులను చాకచక్యంగా పట్టుకున్న అధికారులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి నగదు బహుమతులు అందజేశారు. రాయచోటి డీఎస్పీ ఎంఆర్‌ కృష్ణ మోహన్‌, లక్కిరెడ్డిపల్లి సీఐ హెచ్‌ కృష్ణమరాజు నాయ క్‌, రాయచోటి ఇన్‌స్పెక్టర్‌ బీవీ చలపతి, రామాపురం ఎస్‌ఐ కేవీ శివకుమార్‌, రాయచోటి ఎస్‌ఐ విష్ణువర్దన్‌, పీసీలు అబ్దుల్‌ కలాం, శ్రీనివాసులు, రవీంద్రరాజు, నవీన్‌ కుమార్‌, సీసీఎస్‌ సిబ్బంది బర్కత్‌, మహేంద్ర, హోంగార్డులు గంగిరెడ్డి, తహర్‌బాషాలకు ఎస్పీ నగదు రివార్డులు ఇచ్చి ప్రోత్సహించారు.

రూ .10.62 లక్షల నగలు స్వాధీనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement