వైభవంగా మసెమ్మ జాతర
పుంగనూరు : పుంగనూరు మండలం కురప్పల్లెలో మసెమ్మ జాతర వైభవంగా జరిగింది. శనివారం రాత్రి అమ్మవారిని గ్రామంలో ఊరేగింపు చేసి, భక్తుల దర్శనార్థం ఆలయం వద్ద నిలిపారు. వేలాది మంది భక్తులు మసెమ్మను దర్శించుకున్నారు. సుమారు 50 గ్రామాల ప్రజలతో పాటు కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి కూడా భక్తులు జాతరకు హజరయ్యారు. ఆదివారం రాత్రి అమ్మవారిని గ్రామంలో ఊరేగింపు నిర్వహించి, సోమవారం వేకువజామున నిమజ్జనం చేశారు.రెండు రోజుల పాటు పండుగ వాతావరణంలో భక్తులు జాతరను జరుపుకున్నారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు.
మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పూజలు
మసెమ్మ జాతరతో ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో జాతర్లు ప్రారంభంకావడం ప్రతిఏటా అనాదిగా వస్తోందని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఆదివారం మసెమ్మ జాతరకు పెద్దిరెడ్డి హాజరయ్యారు. అమ్మవారికి వస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. గ్రామంలోని పలువురి ఇళ్లకు వెళ్లి వారితో సరదాగా గడిపారు. అక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మసెమ్మతల్లి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు, రాష్ట్ర ప్రజలు చల్లగా ఉండేలా దీవించాలని ప్రార్థించినట్లు తెలిపారు. రెండోసారి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ప్రార్థించినట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ రెడ్డెప్ప, ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అలీమ్ బాషా, వైఎస్సార్‌సిపి రాష్ట్ర కార్యదర్శులు కొండవీటి నాగభూషణం, వెంకటరెడ్డి యాదవ్, ఎంపీటీసీ నంజుండప్ప, సర్పంచ్ శంకరప్ప, బోయకొండ మాజీ చైర్మన్ నాగరాజారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు అమరనాథరెడ్డి, నాయకులు ఆరడిగుంట రెడ్డెప్ప, జయరామిరెడ్డి, రెడ్డెప్పరెడ్డి, రామకృష్ణారెడ్డి,రాజేష్, సూరి, హేము, కంచప్ప తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా మసెమ్మ జాతర


