● రూ.187 కోట్ల పనులు | - | Sakshi
Sakshi News home page

● రూ.187 కోట్ల పనులు

Feb 8 2026 4:09 AM | Updated on Feb 8 2026 4:09 AM

● రూ.

● రూ.187 కోట్ల పనులు

● రూ.187 కోట్ల పనులు

మదనపల్లె: మదనపల్లె సెలక్షన్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీకి మంజూరైన 15వ ఆర్థిక సంఘం నిధులు సద్వినియోగం ప్రశ్నార్థకమవుతోంది. మార్చి 31 నాటికి నిధులు పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోతే వెనక్కు వెళ్లే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో నిధుల సద్వినియోగం బాధ్యత అధికారులపై ఉంది. ఇప్పటికే పలు అభివృద్ధి పనులకు మున్సిపల్‌ కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది. వివిధ కార్యక్రమాలు, అభివృద్ధి కోసం కౌన్సిలర్లు నిత్యం ప్రతిపాదనలు చేస్తూనే ఉన్నారు.

రూ.45 కోట్ల నిధులు

మదనపల్లె మున్సిపాలిటీకి 2020–21 ఆర్థిక సంవత్సరం నుంచి 2024–25 ఆర్థిక సంవత్సరం వరకు రూ.45,11,28,679 నిధులు 15వ ఆర్థిక సంఘం నుంచి మంజూరయ్యాయి. ఇందులో టైడ్‌, అన్‌టైడ్‌ నిధులు కేటాయించారు. టైడ్‌ నిధులను స్వచ్ఛాంద్ర కార్పొరేషన్‌ ద్వారా చేపట్టే పనుల కోసం ఖర్చు చేస్తారు. ఇక్కడి నిధులను కార్పొరేషన్‌కు చెల్లిస్తే సంస్థ పనులు చేపడుతుంది. ఆన్‌టైడ్‌ నిధులను మున్సిపల్‌ అధికారులు కౌన్సిల్‌ తీర్మాణాల ఆధారంగా అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం టైడ్‌కు కేటాయించిన నిధులు అధికంగా ఉన్నాయి. ఈ మొత్తం నిధుల్లో రూ.16,57,36,372లు ఖర్చు చేశారు. ఇంకా రూ.28,53,92,302లు నిల్వ ఉన్నాయి. ఈ నిధులను పూర్తిగా వినియోగించుకునేందుకు మిగిలింది 52 రోజులే. మార్చి 31 సమీస్తున్నందున అధికారులు నిధులను ఎలా సద్వినియోగం చేస్తారన్న దానిపై ఆందోళన నెలకొంది. ఈ నిధులు పూర్తిగా సద్వినియోగం అవుతాయా .. వెనక్కు వెళ్తాయా అనేది అధికారుల పనితీరుపైనే ఆధారపడి ఉంది.

రూ.4.82 కోట్ల పనులు రద్దు

2020–21లో 15వ ఆర్థిక సంఘం నిధులు సద్వినియోగం కాలేదు. ఈ నేపథ్యంలో అన్‌టైడ్‌కు సంబంధించి రూ.37 లక్షలు, టైడ్‌కు సంబంధించిన రూ.2.63 కోట్లు, కొత్త ఎస్‌ఎస్‌ఆర్‌ ధరల ప్రకారం ఇవ్వాలన్న కారణంతో రూ.1.09 కోట్ల విలువైన 14 పనులను కాంట్రాక్టర్లు రద్దు చేసుకున్నారు. 2021–22లో రూ.63.10 లక్షల విలువైన 11 పనులు రద్దయ్యాయి. దీంతో ఆర్థిక సంఘ నిధులు రూ.4.82 కోట్లను సద్వినియోగం చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది.

రెండేళ్లు కోవిడ్‌ కష్టాలు

ప్రస్తుత మున్సిపల్‌ పాలకవర్గానికి కోవిడ్‌ కష్టాలు వెంటాడాయి. రెండేళ్లపాటు అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపింది. అధికారులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు కోవిడ్‌ నిబంధనలను పాటించాల్సి వచ్చింది. దానికితోడు లాకౌట్‌ పరిస్థితులు అభివృద్ధికి, 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగానికి అడ్డంకిగా ఏర్పడింది. ఈ కారణంగా నిధుల వినియోగంలో కొంత జాప్యం జరిగింది. ఈ రెండేళ్లు నిధులను ఖర్చు చేయలేని పరిస్థితి వల్ల నిధులు నిల్వ పెరగడానికి కారణమైంది.

మదనపల్లె మున్సిపాలిటీ పర్సులో రూ.కోట్ల నిధులు..

ఖర్చుకు మార్చి 31 వరకు గడువు

వినియోగించకుంటే వెనక్కి వెళ్లే అవకాశం

ప్రయత్నిస్తున్నాం

నిధులను మార్చి 31లోగా వినియోగించుకునేలా ప్రయత్నాలు చేస్తు న్నాం. ఇప్పటికే అభివృద్ధికి వినియోగానికి సంబంధించిన చర్యలు చేపట్టాం. జరుగుతున్న పనులపై చర్యలు వేగవంతం చేశాం. కాంట్రాక్టర్లు పనులు పూర్తి చేయించేలా కృషి చేస్తున్నాం. –కే.ప్రమీల, కమిషనర్‌

ప్రస్తుత కౌన్సిల్‌ హయాంలో ఇప్పటిదాకా రూ.187.62 కోట్ల అభివృద్ధి చేపట్టింది. పట్టణ ప్రజలకు అవసరమైన మౌళిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంది. తాగునీరు, మురికినీటి కాలువలు, రోడ్లు, నీటి సరఫరా మెరుగు, పారిశుధ్యం తదితర వాటికి నిధులను వెచ్చించేందుకు కౌన్సిల్‌ తీర్మాణాలను ఆమోదించింది. సొంత నిధులు, జీజీఎంపీ, 15వ ఆర్థిక సంఘం నిధులతో ఈ వ్యయం చేశారు. తాజాగా రూ.10.96 కోట్లతో పనులు చేపడుతున్నారు. అందులో రూ.2.32 కోట్లతో 59 పనులు, రూ.3.67 కోట్లతో 40 పనులు కాంట్రాక్టర్లకు అప్పగించారు. ఇవిగాక రూ.4.96 కోట్లతో 110 పనులకు టెండర్లు నిర్వహిస్తున్నారు. వీటిలో పైప్‌లైన్‌, తాగునీటి బోర్లు, మురికినీటి కాలువల పనులు ఉన్నాయి.

● రూ.187 కోట్ల పనులు 1
1/4

● రూ.187 కోట్ల పనులు

● రూ.187 కోట్ల పనులు 2
2/4

● రూ.187 కోట్ల పనులు

● రూ.187 కోట్ల పనులు 3
3/4

● రూ.187 కోట్ల పనులు

● రూ.187 కోట్ల పనులు 4
4/4

● రూ.187 కోట్ల పనులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement