మహిళ ఆత్మహత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

మహిళ ఆత్మహత్యాయత్నం

Feb 3 2026 7:27 AM | Updated on Feb 3 2026 7:27 AM

మహిళ

మహిళ ఆత్మహత్యాయత్నం

పుంగనూరు : కుటుంబ కలహాలతో ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించిన సంఘటన పట్టణంలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని రహమత్‌నగర్‌కు చెందిన నౌషాద్‌ భార్య మల్లిక (45) ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందుతాగింది. గమనించిన కుటుంబ సభ్యులు స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు.అక్కడ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ద్విచక్ర వాహనం చోరీ

రొంపిచెర్ల : రొంపిచెర్ల క్రాస్‌ రోడ్డులో ద్విచక్ర వాహనం చోరీకి గురైందని బాధితుడు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. రొంపిచెర్ల గ్రామ పంచాయతీ బజారువీధికి చెందిన జి.శ్రీనివాసులు తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని రంగంపేటలోని ప్రైవేట్‌ యూనివర్శిటీలో ఉద్యోగం చేస్తున్నారు. ఇతను రోజూ రొంపిచెర్ల క్రాస్‌ వరకు ద్విచక్ర వాహనంలో వెళ్లి అక్కడ నుంచి బస్సుకు వెళ్లి వస్తున్నారు. అయితే జనవరి 31వ తేదీ రాత్రి తన ద్విచక్ర వాహనాన్ని ఎవరో గర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారని తెలిపారు. చుట్టుపక్కల గాలించినా ఫలితం లేదన్నారు. దీంతో ద్విచక్ర వాహనం చోరీ చేసిన నింధితులను పట్టుకుని తన వాహనాన్ని తనకు అప్పగించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. రొంపిచెర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తెల్లారింది.. తాగండ్రోయ్‌!

మదనపల్లి పట్టణంలోని ఆర్టీసీబస్టాండ్‌ సమీపంలోని ఓ బార్‌లో ఉదయం 7 గంటల నుంచి మద్యం విక్రయాలు జరుపుతున్నారు. సోమవారం ఉదయం కిటీకీ తెరిచి దర్జాగా మద్యం విక్రయాలు చేస్తున్నారు. మద్యం ప్రియులు బార్‌ బయటే కూర్చుని మద్యం తాగి వెళుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన కొందరు స్థానికులు తతంగం మొత్తం వీడియోలు, జీపీఎస్‌ ఫొటోలు తీసి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు. వాస్తవానికి బార్‌ ఉదయం 10 గంటలకు తెరవాల్సి ఉంటుంది. బార్‌కు కేటాయించిన మద్యంను లూజుగా విక్రయించకూడదని ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయి. ఎకై ్సజ్‌ సీఐ భీమలింగను వివరణ కోరితే నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.

చోరీ, వేధింపుల కేసుల్లో

నిందితుడు అరెస్టు

వాల్మీకిపురం : అక్రమంగా గంజాయిని విక్రయించడం, తరలించడం వంటివి చేస్తున్న ఓ వ్యక్తిని సోమవారం పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపారు. సోమవారం స్థానిక సర్కిల్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ రాఘవ రెడ్డి వివరాలను వెల్లడించారు. గుర్రంకొండ పట్టణం బజారు వీధికి చెందిన పఠాన్‌ షౌకత్‌ కుమారుడు కలకడ ఆదిల్‌ (22)పై గంజాయి అక్రమ రవాణాలో ఐదు కేసులు, ఆటో, ద్విచక్రవాహనం చోరీకి సంభందించి రెండు కేసులు, అల్లర్లులో ఒక కేసు, మహిళను వేధించినందుకు ఒక కేసు మొత్తం తొమ్మిది కేసులు ఉన్నాయన్నారు. ఈ మేరకు అతనిని అరెస్ట్‌ చేసి, రిమాండ్‌ నిమిత్తం కోర్టుకు హాజరుపర చినట్లు సీఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో గుర్రంకొండ ఎస్సై రవీంద్ర బాబు, వాల్మీకిపురం ఎస్సై తిప్పేస్వామి పాల్గొన్నారు.

సంపూర్ణతే లక్ష్యం..

గోల్డ్‌మెడల్‌ గమ్యం

కురబలకోట: నీతి అయోగ్‌ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సంపూర్ణత అభియాన్‌ 2.0లో ఏప్రిల్‌ 14 లోపు నిర్దేశిత లక్ష్యాలు సాధించి కురబలకోట మండలం గోల్డ్‌మెడల్‌ సాధించాలని అన్నమయ్య జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి టి. వెంకటపెద్దయ్య సూచించారు. సంపూర్ణత అభియాన్‌పై ఎంపీపీ ఎంజి భూదేవి అధ్యక్షతన సోమవారం స్థానిక మండల పరిషత్‌ మీటింగ్‌ హాల్‌లో వివిధ శాఖల వారితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఊరు ప్రతి కుటుంబం ప్రతి పౌరుడికి వంద శాతం ప్రభుత్వ సేవలు చేరాలన్న సమున్నత లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని తీసుకువచ్చారన్నారు.వ్యవసాయం, పశువైద్యం,విద్య, మహిళా శిశు సంక్షేమం, తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య ఆరోగ్యశాఖలు నిర్దేశిత లక్ష్యాలు సాధించి గోల్డ్‌మెడల్‌ సాధించాలన్నారు. ఇందుకు ప్రజల సహకారం అవసరమన్నారు. జెడ్పీటీసీ బైసాని జ్యోతి, ఎంపీడీఓ గంగయ్య, సీడీపీఓ సుజాత, సూపర్‌వైజర్లు నాగలక్ష్మి,చంద్రకాంత తదితరులు పాల్గొన్నారు.

మహిళ ఆత్మహత్యాయత్నం1
1/2

మహిళ ఆత్మహత్యాయత్నం

మహిళ ఆత్మహత్యాయత్నం2
2/2

మహిళ ఆత్మహత్యాయత్నం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement