బోయకొండలో లక్ష కుంకుమార్చన ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

బోయకొండలో లక్ష కుంకుమార్చన ప్రారంభం

Feb 5 2026 7:33 AM | Updated on Feb 5 2026 7:33 AM

బోయకొ

బోయకొండలో లక్ష కుంకుమార్చన ప్రారంభం

ప్రత్యేక అలంకారంలో అమ్మవారు లక్షకుంకుమార్చనలో పాల్గొన్న ఉభయదారులు

చౌడేపల్లె : బోయకొండ గంగమ్మ ఆలయంలో ప్రతి ఏటా మాఘమాసంలో నిర్వహించే లక్ష కుంకుమార్చన కార్యక్రమం బుధవారం ప్రారంభమైంది. ఈ సందర్బంగా వేద పండితులు,అర్చకుల మంత్రోచ్ఛారణల మధ్య అమ్మవారి ఉత్సవ మూర్తికి ఈఓ ఏకాంబరం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసి లక్ష కుంకుమార్చన కార్యక్రమాన్ని ప్రారంభించారు.మూడు రోజులపాటు ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మవారి ఉత్సవమూర్తి ఎదుట గణపతి, చంఢిహోమం, మహా మంగళహారతి చేశారు.122 మంది దంపతులు పూజల్లో పాల్గొన్నారు. అనంతరంఆలయ అధికారుల ఆధ్వర్యంలో ఉభయదారులకు అమ్మవారి ప్రతిమ గల వెండి కాయిన్‌, పవిత్ర శేషవస్త్రం, తీర్థప్రసాదాలను దంపతులకు అందజేశారు.

దౌర్జన్యాలకు పాల్పడితే చర్యలు

బోయకొండ గంగమ్మ దర్శనార్థంవచ్చే భక్తుల పట్ల సుమో,ఆటో డ్రైవర్లు, మాంసంకటింగ్‌ చేసే వారు దౌర్జన్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మదనపల్లె డీఎస్పీ మహేంద్ర హెచ్చరించారు. బుధవారం బోయకొండలో ఉన్న డ్రైవర్లు , మాంసం కటింగ్‌ దుకాణాల నిర్వాహకులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఇ టీవల ఓ మహిళా భక్తురాలిపట్ల సుమో డ్రైవర్‌ అసభ్య కరంగా ప్రవర్తించడంతో బాధితురాలి ఫిర్యాదు మేర కు అతనిపై కేసు నమోదుచేశామని తెలిపారు. భక్తులపట్ల మర్యాధతో సత్పవర్తనతోమెలగాలని సూచించారు. బోయకొండలో పనిచేస్తున్న వివిధ వాహనాల డ్రైవర్లు, మాంసం కటింగ్‌ నిర్వాహకులు తమ ఆధార్‌, ఫొటోలను పోలీస్‌స్టేషన్‌లొ అందజేసి తగిన గుర్తింపు కార్డు పొందాలన్నారు. సమావేశంలో సీఐ సాయిప్రసాద్‌, ఎస్‌ఐ నాగేశ్వర రావు తదితరులు ఉన్నారు.

బోయకొండలో లక్ష కుంకుమార్చన ప్రారంభం 1
1/1

బోయకొండలో లక్ష కుంకుమార్చన ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement