ప్రకృతి వ్యవసాయంపై నైపుణ్యాభివృద్ధి శిక్షణ
కడప అగ్రికల్చర్ : రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో కడపలోని సింధూర్ ఫంక్షన్ హాల్‌లో ఐసీఆర్‌పీలకు సంబంధించిన ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం సోమ వారం ముగిసింది. ఇందులో ప్రకృతి వ్యవసాయంపై సమగ్ర అవగాహన కల్పించడంతో పాటు క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్న వివిధ ప్రకృతి వ్యవసాయ మోడళ్లను ప్రత్యక్షంగా చూపించారు. అలాగే జీవ ఉత్ప్రేరకాలను ప్రాక్టికల్‌గా తయారు చేయడం, వాటిని సాగులో వినియోగించే విధానంపై కూడా శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా రైతు సాధికార సంస్థ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ విధానాన్ని గ్రామస్థాయిలో ప్రతి రైతుకు చేరేలా అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన వారికి ఆయన ధ్రువపత్రాలను అందజేశారు.


