డైవర్షన్‌ పాలిటిక్స్‌తోనే అరాచకాలు | - | Sakshi
Sakshi News home page

డైవర్షన్‌ పాలిటిక్స్‌తోనే అరాచకాలు

Feb 3 2026 7:27 AM | Updated on Feb 3 2026 7:27 AM

డైవర్షన్‌ పాలిటిక్స్‌తోనే అరాచకాలు

డైవర్షన్‌ పాలిటిక్స్‌తోనే అరాచకాలు

తంబళ్లపల్లె : తిరుమల లడ్డూలో కల్తీ లేదని సిట్‌ నిర్థారించడంతో కూటమి ప్రభుత్వానికి గొంతులో వెలగకాయపడినట్లుయిందని, కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్‌ పాలిటిక్స్‌తో అరాచకాలకు దిగజారిందని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ఆరోపించారు. సోమవారం స్వగృహంలో నాయకులతో చర్చించారు. సమస్యలు అడిగ తెలుసుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. డైవర్షన్‌ పాలిటిక్స్‌తోనే మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్‌ల ఇళ్లపై దాడులు చేయించడం, అంబటి రాంబాబును అక్రమ అరెస్టు చేయడం దారుణమని ఖండించారు. సమావేశంలో పరిశీలకులు ఉమాపతిరెడ్డి, నాగిరెడ్డి ,శివారెడ్డి, పార్టీ కన్వీనర్‌ చౌడేశ్వర్‌, కన్నెమడుగు సురేంద్రనాథ్‌, ఎంపిటీసీ మహేష్‌, శివారెడ్డి, రామమూర్తి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement