ఎస్సీఎస్టీ కేసులో ఆంధ్రజ్యోతి విలేకరికి నాలుగేళ్ల జైలు! | - | Sakshi
Sakshi News home page

ఎస్సీఎస్టీ కేసులో ఆంధ్రజ్యోతి విలేకరికి నాలుగేళ్ల జైలు!

Jan 29 2026 6:22 AM | Updated on Jan 29 2026 6:22 AM

ఎస్సీఎస్టీ కేసులో ఆంధ్రజ్యోతి విలేకరికి నాలుగేళ్ల జైలు!

ఎస్సీఎస్టీ కేసులో ఆంధ్రజ్యోతి విలేకరికి నాలుగేళ్ల జైలు!

రాజంపేట : రాజంపేటపురపాలికసంఘంలో స్వీపర్‌గా పనిచేస్తున్న చెవూరి సురేష్‌(మాదిగ)పై చేయిచేసుకున్నందుకు రాజంపేట ఆంధ్రజ్యోతి టౌన్‌ విలేకరికిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదైన నేపథ్యంలో నేరం రుజువు కావడంతో నాలుగేళ్ల సాధారణ జైలుశిక్ష, రూ1000 జరిమానా విధిస్తూ ఎస్సీ, ఎస్టీ –4 ఎడీజె న్యాయమూరి జీ.దీనబాబు తీర్పు ఇచ్చారు. ఈ మేరకు పట్టణ పోలీసుస్టేషన్‌ బుధవారం పత్రికలకు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలు.. రాజంపేట పురపాలికసంఘంలో స్వీపర్‌గా పనిచేస్తున్న చెవూరి సురేష్‌ (రాజంపేట పట్టణ ఈడిగపాలెం), మస్తాన్‌ అనే వ్యక్తికి రూ.1000 బాకీ ఉన్నాడు. 25.07.2021న మధ్యాహ్నం తన విధులు ముగించుకొని ఇంటికిపోతున్న క్రమంలో మస్తాన్‌ సెల్‌షాపు వద్దకు పోగా, అక్కడ మస్తాన్‌ తనకు బాకీ ఉన్న డబ్బులు ఇవ్వమని అడిగారు. రేపు లేదా ఎల్లుండి ఇస్తానన్నారు. అక్కడే ఉన్న ఆంధ్రజ్యోతి విలేకరి ఉదయగిరి కళ్యాణ్‌ (రాజంపేట టౌన్‌ సాయినగర్‌) వాడితో ఎందీ మాట్లాడేది మోటారు సైకిల్‌ తీసుకొమని చెప్పారు. అందుకు సురేష్‌ నా మోటారు సైకిల్‌ తీసుకుంటారా అడిగారు. కళ్యాణ్‌ తన చేత్తో సురేష్‌ చెంపపై కొట్టాడు. కులంపేరుతో దూషించాడు. బాధితుడు రాజంపేట అర్బన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పటి రాజంపేట టౌన్‌ ఎస్‌ఐ ప్రసాద్‌రెడ్డి కేసు నమోదు చేశారు. అప్పటి రాజంపేట డీఎస్పీ శివభాస్కర్‌రెడ్డి కేసు విచారణ చేపట్టారు. నిందితుడు కళ్యాణ్‌ ను అరెస్టు చేసి, చార్జీషీటును కోర్టులో దాఖాలు చేశారు. ఎస్సీ ఎస్టీ కోర్టు –4 ఏడీజె కోర్టు న్యాయమూర్తి దీనబాబు సాక్షులను విచారించారు. నేరం నిరూపణ కావడంతో నిందితుడు ఉదయగిరి కళ్యాణ్‌కు 4 సంవత్సరాలు జైలుశిక్ష, రూ.1000 జరిమానా విధించారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్‌ తరపున వాదనలు వినిపించిన స్పెషల్‌ పీపీ ఎల్‌.బాలాజీ, అప్పటి డీఎస్పీ శివభాస్కర్‌రెడ్డి, కోర్టులో సాక్షులను సక్రమంగా హాజరుపరిచి, నిందితుడికి శిక్ష పడడానికి కారణమైన కోర్టు మానిటరింగ్‌ సెల్‌ హెడ్‌కానిస్టేబుల్‌ ఎం.సుబ్బరాయుడు, వెంకటేశ్వరరెడ్డి, తిరుపతయ్యలను ప్రస్తుత రాజంపేట ఎఎస్పీ మనోజ్‌రామ్‌నాఽథ్‌హెగ్డే, రాజంపేట సీఐ నాగార్జునలను జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్‌ విశ్వనాథ్‌ ఐపీఎస్‌లు సిబ్బందిని అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement