వాహనం ఢీకొని జింక మృతి | - | Sakshi
Sakshi News home page

వాహనం ఢీకొని జింక మృతి

Jan 29 2026 6:22 AM | Updated on Jan 29 2026 6:22 AM

వాహనం

వాహనం ఢీకొని జింక మృతి

పెద్దతిప్పసముద్రం : స్థానిక బి.కొత్తకోట రోడ్డులోని బాంబే ఎస్టేట్‌ సమీపంలో బుధవారం ఓ జింకను గుర్తు తెలియని వాహనం ఢీకొంది. తీవ్రగాయాలతో అక్కడిక్కడే మృతి చెందింది. రోడ్డు దాటే క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమీప పొలాల్లో పని చేస్తున్న రైతులు ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులకు ఫోన్‌ ద్వారా సమాచారం అందించారు.

భార్యగొంతుకోసిన భర్త

పుంగనూరు : భార్యపై అనుమానంతో ఆమె గొంతు కోసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు ఓ భర్త. ఈ సంఘటన బుధవారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని మంగళం గ్రామంలో నివాసం ఉన్న అశోక్‌, మౌనికలకు ఆరేళ్ల క్రితం వివాహమైంది. ఇలా ఉండగా మౌనిక పై అశోక్‌ అనుమానం పెంచుకుని నిత్యం ఆమెను వేదించేవాడు. ఇలా ఉండగా ఉదయం మౌనిక ఇంట్లో పనులు చేసుకుంటుడగా అశోక్‌ కత్తి తీసుకుని భార్య మెడపై నరికాడు. మౌనిక కేకలు వేయగా పొరుగున వారు వచ్చి ఆమెను కాపాడారు. దాడిలో మౌనిక మెడ తెగిపోయి తీవ్ర రక్తస్రావమైంది. బాధితురాలిని స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అశోక్‌ పరారీలో ఉన్నాడు. సీఐ సుబ్బరాయుడు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సుమతీ శతకం

సినీ ప్రమోషన్‌

కురబలకోట: అంగళ్లులోని మిట్స్‌ డీమ్డ్‌ యూనివర్సిటీలో సుమతీ శతకం సినిమా ప్రమోషన్‌ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. చిత్ర బృందం విద్యార్థులతో ఉత్సాహంగా సినిమా విశేషాలను పంచుకున్నారు. చిత్ర హీరో అమరదీప్‌ మాట్లాడుతూ కుటుంబ సమేతంగా చూడతగ్గ సినిమా అన్నారు. నటీనటులు అనుభవాన్ని పంచుకున్నారు. మిట్స్‌ యూనివర్సిటీ ప్రో చాన్స్‌లర్‌ ఎన్‌. ద్వారకనాఽథ్‌ తదితరులు పాల్గొన్నారు. చిత్ర నటులు నృత్యాలతో అలరించారు. సినిమాను ఆదరించాలని కోరారు.

జాతీయస్థాయి పోటీలకు ఎంపిక

పులివెందుల రూరల్‌ : పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లె గ్రామంలోని జిల్లా పరిషత్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఎం.గీత జాతీయస్థాయి హ్యాండ్‌ బాల్‌ పోటీలకు ఎంపికైందని హెచ్‌ఎం రవిచంద్రారెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ప్ర కాశం జిల్లా సింగరాయకొండలో గతనెలలో జరిగిన రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్‌–19 హ్యాండ్‌బాల్‌ పోటీల్లో గీత ప్రతిభ కనబరిచిందన్నారు. ఫిబ్ర వరి 1 నుంచి హిమాచల్‌ప్రదేశ్‌లోని బిలాస్పూర్‌ జిల్లాలో జరిగే పోటీల్లో పాల్గొంటుందని తెలిపారు.

వాహనం ఢీకొని జింక మృతి1
1/2

వాహనం ఢీకొని జింక మృతి

వాహనం ఢీకొని జింక మృతి2
2/2

వాహనం ఢీకొని జింక మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement