నీటి నిల్వ పనులకే ప్రాధాన్యత
– డ్వామా పీడీ వెంకటరత్నం
పెద్దమండ్యం : జీరామ్‌జీ పథకం ద్వారా వర్షం నీరు నిల్వ చేసుకునే పనులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు డ్వామా పీడీ వెంకటరత్నం అన్నారు. మండలంలోని కలిచెర్లలో జరుగుతున్న కందకాల పనులను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా చేపడుతున్న పనులు, వేతనాలపై కూలీలకు అవగాహన కల్పించారు. వర్షం నీటి నిల్వకోసం పనులు విరివిగా చేపట్టాలన్నారు. ప్రతి రోజు 5 గంటల పాటు పని చేసి రూ.300 లు వేతనం పొందాలని కూలీలకు సూచించారు. అలాగే 5 ఎకరాలలోపు భూమి కలిగిన రైతులకు పండ్లతోటల పెంపకానికి దరఖాస్తు చేసుకోవాలన్నారు. పాడి రైతులు పశుగ్రాసం పెంచుకొనేందుకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. వాటర్‌షెడ్ పథకంలో చేపట్టిన ఫారంపాండ్‌లను ఆయన పరిశీలించారు. అనంతరం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. కూలీలకు సకాలంలో పనులు కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. చేసిన పనులకు బిల్లులు చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ నందకుమార్‌రెడ్డి, ఎంపీడీవో శ్రీధర్‌రావు, ఏపీవో సురేంద్రనాఽథ్‌రెడ్డి, సాంకేతిక సహాయకులు, క్షేత్ర సహాయకులు పాల్గొన్నారు.
నేడు భీష్మ ఏకాదశి
ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో గురువారం ఘనంగా భీష్మ ఏకాదశి వేడుకలు నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గర్భాలయంలోని మూలవిరాట్‌కు ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం ఉత్సవ మూర్తులను సుందరంగా అలంకరించి, వైభవంగా గ్రామోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు.
నీటి నిల్వ పనులకే ప్రాధాన్యత


