గ్రామీణ బ్యాంక్‌లో చోరీకి యత్నం
రొంపిచెర్ల : రొంపిచెర్ల సప్తగిరి గ్రామీణ బ్యాంక్‌లో సోమవారం రాత్రి చోరీ యత్నం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. రొంపిచెర్ల గ్రామ పంచాయతీలోని బజారువీధిలోని ఓ.వెంకటరత్నం భవనంలో సప్తగిరి గ్రామీణ బ్యాంక్ నిర్వహిస్తున్నారు. సోమవారం రాత్రి దొంగలు బ్యాంక్ లాకర్ల వైపు ఉన్న కిటికీలు పగలగొడుతుండగా శబ్దం విని పక్కనే ఉన్న బాల సుబ్రమణ్యం కేకలు వేయడంలో ఇద్దరు దొంగలు పరారయ్యారు. మంగళవారం బ్యాంక్ ఉద్యోగులు సమ్మెలో ఉండడంతో బుధవారం విధులకు వచ్చిన బ్యాంకర్లు విషయం తెలుసుకుని రొంపిచెర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


