ఫిజియోథెరపిస్ట్‌ల మెరిట్‌ లిస్టు ప్రకటన | - | Sakshi
Sakshi News home page

ఫిజియోథెరపిస్ట్‌ల మెరిట్‌ లిస్టు ప్రకటన

Feb 1 2026 3:23 AM | Updated on Feb 1 2026 3:23 AM

ఫిజియ

ఫిజియోథెరపిస్ట్‌ల మెరిట్‌ లిస్టు ప్రకటన

ఫిజియోథెరపిస్ట్‌ల మెరిట్‌ లిస్టు ప్రకటన శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం ఎనిమిదిమంది డిబార్‌ మట్టి నమూనాల సేకరణ పూర్తి చేయాలి

మదనపల్లె సిటీ: జిల్లాలోని భవిత కేంద్రాల్లో ఖాళీగా ఉన్న ఫిజియోథెరపిస్ట్‌ పోస్టుల మెరిట్‌ లిస్టు ప్రకటించినట్లు సమగ్ర శిక్ష అడిషనల్‌ ప్రాజెక్టు కో–ఆర్డినేటర్‌ డాక్టర్‌ అనురాధ ఓ ప్రకటనలో తెలిపారు. ఐదు ఫిజియోథెరపిస్టు పోస్టులకు 32 దరఖాస్తులు వచ్చాయన్నారు. బీపీటీ, ఎంపీటీ మార్కుల ఆధారంగా తయారు చేసిన మెరిట్‌లిస్టును సమగ్రశిక్ష కార్యాలయం, జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ ప్రాంగణం, మదనపల్లెలో, ప్రతి మండలంలోని ఎంఆర్‌సీ, భవిత కేంద్రాల్లోని నోటీసు బోర్డులలో ఉంచామన్నారు. దరఖాస్తుదారులు అభ్యర్థనలు, సందేహాల నివృత్తి కొరకు లిఖితపూర్వకంగా సమగ్రశిక్ష కార్యాలయం, మదనపల్లె నందు సంప్రదించాలన్నారు. సమాచారం కోసం 9440455211, 8309472517 నంబర్లలో సంప్రదించాలన్నారు.

ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో శనివారం శాస్త్రోక్తంగా మూలవిరాట్‌లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ముందుగా ప్రధాన అర్చకులు వీణా రాఘవాచార్యులు, వీణా మనోజ్‌ కుమార్‌లు మూల విరాట్‌ కి పంచామృతాభిషేకం నిర్విహించి, టీటీడీ అధికారులు తీసుకొచ్చిన నూతన పట్టువస్త్రాలు, పూలు, పండ్లతో ఆలయ ప్రదక్షణ చేసి, గర్భాలయంలోని మూల విరాట్‌కి సమర్పించారు. నూతన పట్టువస్త్రాలను తొడిగి, బంగారు ఆభరాణాలు వేసి, తులసి గజమాలలతో సుందరంగా అలంకరించారు. అనంతరం సీతారామలక్ష్మణ మూర్తులకు ప్రత్యేక పూజలతో శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. శనివారం కావడంతో స్వామి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు.

కడప ఎడ్యుకేషన్‌: యోగి వేమన విశ్వవిద్యాలయం డిగ్రీ మొదటి సెమిస్టర్‌ పరీక్షల్లో శనివారం జిల్లాలో 8 మంది డిబార్‌ అయినట్లు విశ్వవిద్యాలయ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ప్రొఫెసర్‌ కె.ఎస్‌.వి.కృష్ణారావు తెలి పారు. మైదుకూరు ఎస్‌బీఎస్‌వైఎం డిగ్రీ కళాశాలలో ఇద్దరు, పుల్లారెడ్డిపేట ఎస్‌ఎల్‌ఎస్‌ డిగ్రీ కళాశాలలో ఆరుగురిని డిబార్‌ చేసామన్నారు. ఆ కేంద్రాలను తనతో పాటు హైపవర్‌ కమిటీ సభ్యులు డాక్టర్‌ ఎస్వీ సుబ్బారెడ్డి, కట్టా వెంకటేశ్వర్లు తనిఖీలు చేశారన్నారు. కాగా, ఒంటిమిట్టలోని డిగ్రీ పరీక్ష కేంద్రాన్ని హై పవర్‌ కమిటీ సభ్యులు ప్రొఫెసర్‌ రియాజున్నీసా, డాక్టర్‌ మాదక్క తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆచార్య కృష్ణారావు మాట్లాడుతూ వైఎస్సార్‌ కడప, మదనపల్లి, తిరుపతి జిల్లాలలోని పరీక్ష కేంద్రాలకు అబ్జర్వర్లతో పాటు తనిఖీ బృందాలు పర్యవేక్షిస్తున్నాయన్నారు. శనివారం జరిగిన పరీక్షలకు 7,322 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు.

కడప ఎడ్యుకేషన్‌: ప్రకృతి వ్యవసాయం చేసే రైతుల పొలాల్లో నుంచి మట్టి నమూనాల సేకరణ మార్చి 25కల్లా పూర్తి చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి బుక్కే చంద్రానాయక్‌ సూచించారు. శనివారం కడప ఊటుకూరులోని జిల్లా వనరుల కేంద్రంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి మట్టి నమూనాల సేకరణపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి బుక్కే.చంద్ర నాయక్‌ మాట్లాడుతూ నేషనల్‌ మిషన్‌ ఆన్‌ నాచురల్‌ ఫార్మింగ్‌ స్కీం కింద 2025–26 సంవత్సరానికి జిల్లాలో 25,000 మట్టి నమూనాల సేకరణ విశ్లేషణ లక్ష్యంగా నిర్దేశించారని తెలియజేశారు. ఈ పథకం కింద జిల్లాలోప్రకృతి వ్యవసాయం చేసే రైతుల పొలాల్లో నుంచి మట్టి నమూనాలు సేకరించి కడప భూసార పరీక్ష కేంద్రానికి పంపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భూసార పరీక్షా కేంద్రం వ్యవసాయ సహాయ సంచాలకులు రాధాదేవి, వ్యవసాయ అధికారులు ఈశ్వర కవిత, భారతి, సాయి జ్యోతి పాల్గొని మట్టి నమూనా సేకరణ, మొబైల్‌ యాప్‌ వినియోగంపై ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి శిక్షణ కల్పించారు.

ఫిజియోథెరపిస్ట్‌ల  మెరిట్‌ లిస్టు ప్రకటన 1
1/1

ఫిజియోథెరపిస్ట్‌ల మెరిట్‌ లిస్టు ప్రకటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement