రోడ్డుప్రమాదంలో బాలుడికి తీవ్రగాయాలు
పుంగనూరు : మండలంలోని సుగాలిమిట్ట అంగన్‌వాడీ కేంద్రం సమీపంలో వస్తున్న బాలుడిని బుధవారం బొలెరో వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు.సుగాలిమిట్టకు చెందిన నరేష్‌నాయక్ కుమారుడు అన్వేష్(4) బాలుడిని అవ్వ లక్ష్మమ్మ అంగన్‌వాడీ కేంద్రానికి తీసుకెళ్లి తిరిగి వస్తుండగా మదనపల్లె నుంచి చిత్తూరుకు వెళ్తున్న బొలెరో వాహనం అతివేగంగా వచ్చి ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. స్థానికులు బాలుడిని ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో కోలారు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బొలెరో వాహనం ఢీకొని..
కలకడ : బొలెరో పికప్ పాల వాహనం ఢీకొనడంతో యువకుడు తీవ్రంగా గాయపడిన సంఘటన మండలంలోని కోన పంచాయతీ, బంగారువాండ్లపల్లె సమీపంలో జరిగింది. క్షతగాత్రుడి తండ్రి షేక్.అక్బర్‌బాషా తెలిపిన వివరాలమేరకు బంగారువాండ్లపల్లె గ్రామానికి చెందిన షేక్.బాబ్జీ మంగళవారం సాయంత్రం ద్విచక్రవాహనంలో కోన గ్రామానికి ద్విచక్రవాహనంలో వచ్చి తిరిగి వెళుతుండగా క్రిష్ణారెడ్డి మామిడితోపు వద్ద వెనుక వైపు నుంచి కోన గ్రామం నుంచి గుర్రంకొండ వైపు వెళుతున్న బొలెరో పికప్ పాలవాహనం ఢీ కొంది. దీంతో షేక్.బాబ్‌జి తల, శరీరంపై తీవ్ర అయ్యాయి. అతన్ని చికిత్స నిమిత్తం కలికిరి మండలం, మహల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పీలేరు ప్రభుత్వాసుపత్రికి రెఫర్ చేశారు.షేక్ బాబ్జీ తండ్రి బుధవారం కలకడ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విద్యుత్‌షాక్‌తో రైతుకు..
మదనపల్లె రూరల్ : విద్యుత్‌షాక్‌తో రైతు తీవ్రంగా గాయపడిన ఘటన మంగళవారం రాత్రి మదనపల్లె మండలంలో జరిగింది. కోటవారిపల్లెకు చెందిన రైతు పాండు(45) రాత్రి కరెంటు ఉండటంతో పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లాడు. మోటార్ ఆన్‌చేసేందుకు ప్రయత్నించగా విద్యుత్‌షాక్‌కు గురై తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం తెలుసుకున్న కుటుంబసభ్యులు బాధితుడిని హుటాహుటిన మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు.
కారు, బైక్ ఢీ:వ్యక్తికి గాయాలు
చిన్నమండెం : మండల పరిధిలోని బెంగళూరు–కడప జాతీయ ప్రధాన రహదారిపై వండాడి క్రాస్ వద్ద కారు ద్విచక్రవాహనం ఢీకొని ఒక వ్యక్తికి గాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు ప్రొద్దుటూరుకు చెందిన గుర్రప్ప అనే వ్యక్తి రాయచోటి నుంచి బైక్‌లో చిన్నమండెం వస్తుండగా చిన్నమండెం నుండి రాయచోటి వెళ్తున్న కారు ఢీకొనడంతో గుర్రప్ప కాలికి గాయాలయ్యాయి.అతన్ని 108 వాహనంలో రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీనిపై పోలీసులకు సమాచారం రాలేదు.
నాటు బాంబు పేలి
పాడి ఆవుకు తీవ్ర గాయాలు
చౌడేపల్లె : నాటు బాంబు (నల్లమందు ఉంట) పేలి పాడి ఆవుకు తీవ్ర గాయాలైన సంఘటన దుర్గసముద్రం పంచాయతీ బుటకపల్లి అటవీ ప్రాంతంలో బుధవారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. బుటకపల్లెకు చెందిన ఆర్. వెంకటరమణ పాడి ఆవులను మేతకోసం సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తోలుకెళ్లాడు. వన్యప్రాణులను వేటాడేందుకు వేటగాళ్లు పెట్టిన నాటుబాంబును ఆవు కొరకడంతో పేలి శబ్దం వచ్చింది. పశువుల కాపరులు గుర్తించగా పాడి ఆవు తీవ్రంగా గాయపడింది. ఇటీవల కాలంలో అటవీప్రాంతాలకు సమీపంలోని గ్రామాల్లో వేటగాళ్లు వన్యమృగాలను వేటాడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలున్నాయి.
అక్కపై తమ్ముడి దాడి
నిమ్మనపల్లె : ఆస్తి వివాదాల కారణంగా అక్కపై తమ్ముడు దాడిచేసిన ఘటన బుధవారం సాయంత్రం నిమ్మనపల్లె మండలంలో జరిగింది. రాచవేటివారిపల్లె పంచాయతీ వడ్డిపల్లెకు చెందిన కృష్ణప్ప భార్య రెడ్డెమ్మ(50)కు తన తమ్ముడైన మంజునాథతో ఆస్తి వివాదాలు ఉన్నాయి. ఈ క్రమంలో బుధవారం కూలిపనులకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చిన రెడ్డెమ్మను మంజునాథ భార్య అకారణంగా తిట్టడం మొదలుపెట్టింది. ఈ విషయమై రెడ్డెమ్మ మధ్యవర్తికి ఫిర్యాదుచేసింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం ఏర్పడింది. ఇంతలో అక్కడకు వచ్చిన మంజునాథ్ ఒక్కసారిగా పక్కనే ఉన్న కర్ర తీసుకుని విచక్షణారహితంగా రెడ్డెమ్మపై దాడికి పాల్పడ్డాడు. దాడిలో రెడ్డెమ్మ తలకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల సహాయంతో మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం బాధితురాలిని తిరుపతికి రెఫర్ చేశారు.
రోడ్డుప్రమాదంలో బాలుడికి తీవ్రగాయాలు
రోడ్డుప్రమాదంలో బాలుడికి తీవ్రగాయాలు
రోడ్డుప్రమాదంలో బాలుడికి తీవ్రగాయాలు
రోడ్డుప్రమాదంలో బాలుడికి తీవ్రగాయాలు


