వేర్వేరు ప్రమాదాల్లో నలుగురికి గాయాలు
మదనపల్లె అర్బన్ : జిల్లాలో శనివారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. కురబలకోట మండలం అంగళ్లుకు చెందిన వెంకటరమణ(45)వ్యవసాయం చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో శనివారం సొంత పనులపై ద్విచక్రవాహనంలో మదనపల్లెకు బయలుదేరాడు. దారిలో సర్కార్‌తోపు వద్ద వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో రైతుకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు బాధితుడిని చికిత్స నిమిత్తం ఆటోలో మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు.
ద్విచక్రవాహనం ఢీకొని
మదనపల్లె టౌన్ : ద్విచక్రవాహనం ఢీకొని రైతు తీవ్రంగా గాయపడ్డ సంఘటన శనివారం నిమ్మనపల్లె మండలంలో చోటు చేసుకుంది. బాధితుడి కథనం మేరకు.. బాలినాయునిపల్లెకు చెందిన రైతు శ్రీనివాసులు(70) సొంత పని మీద బైకుపై సోమల మండలంలోని కందూరుకు వెళ్లాడు. పని ముగించుకుని తిరిగి ఇంటికి వస్తుండగా, మార్గంమధ్యలోని మఠంతోపు వద్ద మరో బైకు ఢీకొని కాళ్లు, చేతులు విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. బాధితున్ని స్థానికులు 108లో మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించడంతో డాక్టర్లు వైద్యం అందించారు. నిమ్మనపల్లె పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
రెండు బైకులు ఢీకొని..
పుంగనూరు : మండలంలోని కృష్ణదేవరాయ సర్కిల్ వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనా లు ఢీకొనడంతో ఒక వ్యక్తి గాయపడిన సంఘటన జరిగింది. బైరెడ్డిపల్లె మండలం బాపలనత్తంకు చెందిన వెంకటేష్(30) ద్విచక్రవాహనంలో మదనపల్లెకు వెళ్తుండగా మార్గంమధ్యలో ప్రమాదం జరిగింది. బా ధితున్ని 108లో ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
ఆటో– కారు ఢీ..
వాల్మీకిపురం : ఆటో – కారు ఢీకొనడంతో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన మండలంలోని చింతలవారిపల్లి సమీపంలోని హైవేపై చోటు చేసుకొంది. తిరుపతి నుంచి మదనపల్లి వైపు వెళ్తున్న ఆటోను కారు ఢీకొన్న ప్రమాదంలో ఆటో డ్రైవర్ నగేష్‌కు కుడి కాలు విరిగిపోయింది. దీంతో హైవే అంబులెన్స్‌లో నగేష్‌ను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నగేష్‌ను మదనపల్లికి రెఫర్ చేశారు. ఈ మేరకు ఎస్సై తిప్పేస్వామి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చికిత్స పొందుతున్న శ్రీనివాసులు గాయపడిన నగేష్
వేర్వేరు ప్రమాదాల్లో నలుగురికి గాయాలు


