ఇద్దరు వ్యక్తులు అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

ఇద్దరు వ్యక్తులు అరెస్ట్‌

Feb 3 2026 7:27 AM | Updated on Feb 3 2026 7:27 AM

ఇద్దరు వ్యక్తులు అరెస్ట్‌

ఇద్దరు వ్యక్తులు అరెస్ట్‌

వాల్మీకిపురం : అక్రమంగా కత్తులతో బెదిరించి దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్‌ చేసినట్లు సీఐ రాఘవ రెడ్డి తెలిపారు. సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ మద్యానికి బానిసై, క్రికెట్‌ బెట్టింగులకు అలవాటు పడిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్‌ చేసినట్టు చెప్పారు. వాల్మీకిపురానికి చెందిన మంకమూతక రమేష్‌ (24), కరమల లోకేష్‌ (20)లు బెంగళూరులో సెల్‌ పోన్లు దొంగతనం చేయడంతో పాటు వాల్మీకిపురం పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలిలో ఓ వ్యక్తిని కత్తితో బెదిరించి అతని వద్ద ఉన్న వన్‌ప్లస్‌ మొబైల్‌, రూ.130 నగదు దోచుకున్నట్లు తెలిపారు. వీరిని అరెస్ట్‌ చేసి, వీరి వద్ద ఉన్న కత్తి, వన్‌ ప్లస్‌ మొబైల్‌ ఒకటి, ఆపిల్‌ ఫోన్‌ ఒకటి, ఏపీ40ఎఎక్స్‌9538 గల ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరిని రిమాండ్‌ నిమిత్తం కోర్టుకు హాజరు పరిచి, సబ్‌జైలుకు తరలించామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు తిప్పేస్వామి, రవీంద్రబాబు, ఎఎస్సై గోపాల్‌ నాయక్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement