బైక్‌ను తప్పించబోయి కారు బోల్తా
లక్కిరెడ్డిపల్లి : ఎదురుగా వచ్చిన బైక్‌ను తప్పించబోయి ఓ కారు బోల్తా పడింది. ఈ ఘటన లక్కిరెడ్డిపల్లె మండలం మద్దిరేవుల వంక బ్రిడ్జి వద్ద గురువారం రాత్రి జరిగింది. స్థానికుల కథనం మేరకు వివరాలు..వైఎస్సార్ కడప జిల్లా వేంపల్లె సర్పంచ్ శ్రీనివాసులు, దివాకర్‌రెడ్డితో పాటు మరో ఇద్దరు ఉదయం కాణిపాకం వెళ్లారు. దర్శనానంతరం తిరిగి వేంపల్లెకు బయలుదేరారు. మద్దిరేవుల వంక బ్రిడ్జి సమీపంలోకి రాగానే ఎదురుగా ద్విచక్రవాహనం వచ్చింది. దీనిని తప్పించబోయి రోడ్డుపక్కన ఉన్న మామిడితోటలోకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో దివాకర్‌రెడ్డికి తీవ్రంగా, సర్పంచ్ శ్రీనివాసులు,డ్రైవర్ మరొకరికి స్వల్పగాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే సర్పంచ్ శ్రీనివాసులు లక్కిరెడ్డిపల్లె ఎంపీపీ సుదర్శన్‌రెడ్డికి సమాచారం అందించండంతో ఆయన అనుచరులు సంఘటన స్థలానికి చేరుకుని 108లో లక్కిరెడ్డిపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దివాకర్‌రెడ్డికి కాలు ఫ్రాక్చర్ కావడంతో మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్ తరలించారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
క్షతగాత్రులను పరామర్శించడానికి వెళ్తూ..
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించడానికి వేంపల్లె నుండి లక్కిరెడ్డిపల్లికి కారులో వస్తున్న బంధువులు ప్రమాదానికి గురయ్యారు. మండల కేంద్రంలోని చింతకుంటవాండ్లపల్లి వద్ద మరమ్మతులు జరుగుతున్న జాతీయ రహదారికి పక్కనే ఉన్న విద్యుత్ స్థంభాన్ని కారు ఢీ కొనడంతో అందులో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు ప్రమాదం జరిగిన వెంటనే సబ్ స్టేషన్‌కు ఫోన్ చేసి విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. గాయపడిన వారిని లక్కిరెడ్డిపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
వేంపల్లె సర్పంచ్, ఇద్దరికి గాయాలు
బైక్‌ను తప్పించబోయి కారు బోల్తా
బైక్‌ను తప్పించబోయి కారు బోల్తా


