వైభవంగా లక్ష కుంకుమార్చన
చౌడేపల్లె : పుణ్యక్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో లక్షకుంకుమార్చన పూజలు వైభవంగా జరుగుతున్నాయి. గురువారం వేద పండితులు గోవర్ధనశర్మ, అర్చకులు గంగిరెడ్డిల మంత్రోచ్ఛారణల మధ్య అమ్మవారి ఉత్సవ మూర్తికు ఆలయ ఈఓ ఏకాంబరం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసి దంపతులకు పూజా సామాగ్రిని అందజేశారు.అమ్మవారి ఉత్సవ మూర్తి ఎదుట గణపతి, చండీహోమం, మహా మంగళహారతి చేశారు. అనంతరం ఈఓ ,ఆలయ అధికారులు దంపతులకు తీర్థప్రసాదాలను దంపతులకు అందజేశారు. ఆలయంలో రెండు రోజులుగా జరుగుతున్న లక్ష కుంకుమార్చన పూజలు శుక్రవారంతో ముగియనున్నట్లు ఈఓ పేర్కొన్నారు.


