బాహుదాకు కృష్ణా జలాలు మళ్లించండి
మదనపల్లె : నిమ్మనపల్లె మండలంలోని బాహుదా ప్రాజెక్టుకు శాశ్వతంగా కృష్ణా జలాలను తరలించి నింపేలా చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ నేతలు సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ నిశాంత్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. నీటిని మళ్లించాల్సిన ఆవశ్యకత, వేసవి వస్తున్న కారణంగా అవసరాన్ని కలెక్టర్‌కు వివరించారు. అనంతరం వైఎస్సార్‌సీపీ ఎస్‌ఈసీ మెంబర్ జి.షమీంఅస్లాం, మున్సిపల్ చైర్మన్ వరపన మనూజ, వైస్‌చైర్మన్ జింకా వెంకటా చలపతి మీడియాతో మాట్లాడుతూ హంద్రీ–నీవా కాలువలో ప్రవహిస్తున్న కృష్ణా జలాలను బాహుదా, మదనపల్లె నియోజకవర్గంలోని చెరువులు, కుంటలకు, చిప్పిలి, గుంటివారిపల్లి సమ్మర్‌స్టోరేజి ట్యాంకులకు కృష్ణా జలాలను తరలించాలని కలెక్టర్‌ను కోరామన్నారు. వేసవి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ చర్య చేపట్టాలన్నారు. తద్వారా మదనపల్లె పట్టణానికి తాగునీటి సమస్య తీరడంతోపాటు భూగర్భజలాలు వృద్ధి చెందుతాయన్నారు. కృష్ణా జలాలన్నీ కుప్పానికి తరలించుకుంటున్నారని, మదనపల్లె విషయంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో చిప్పిలి సమ్మర్‌స్టోరేజి ట్యాంకుకు నీళ్లిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి కృష్ణా జలాలతో మదనపల్లె చెరువులు, బాహాదా ప్రాజెక్టు, కాలువలకు మళ్లించాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో కౌన్సిలర్ పాల్ చంద్రశేఖర్, నాయకులు గుండ్లూరి రఫీ, బాలగంగాధర్‌రెడ్డి, ఇర్ఫాన్ షేక్, మల్లిక, వినుతాబాయి, శారదరెడ్డి పాల్గొన్నారు.


