దూసుకెళ్లిన ‘రాకేష్‌’ | - | Sakshi
Sakshi News home page

దూసుకెళ్లిన ‘రాకేష్‌’

Feb 3 2026 7:27 AM | Updated on Feb 3 2026 7:27 AM

దూసుకెళ్లిన ‘రాకేష్‌’

దూసుకెళ్లిన ‘రాకేష్‌’

కమలాపురం : వైఎస్సార్‌ కడప జిల్లా కమలాపురం పట్టణం అప్పాయపల్లెకు చెందిన న్యాయవాది నాగభూషణ్‌రెడ్డి కుమారుడు రాకేష్‌రెడ్డి గ్రూప్‌–1 ఫలితాల్లో విజేతగా నిలిచి డీఎస్‌పీగా ఎంపికయ్యారు. రాకేష్‌రెడ్డి బాల్యం స్వగ్రామం పులివెందుల నియోజకవర్గం గొల్లల గూడూరులో సాగింది. వృత్తి రీత్యా నాగభూషణ్‌ రెడ్డి, భాగ్యలక్ష్మి దంపతులు కమలాపురంలో స్థిరపడ్డారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు రాజంపేటలోని నవోదయ విద్యాలయంలో చదివిన రాకేష్‌రెడ్డి ఇంటర్‌ పులివెందుల నారాయణ కాలేజ్‌లో, అనంతపురం జేఎన్‌టీయూలో ట్రిపుల్‌ ఈ పూర్తి చేశారు. స్కాలర్‌షిప్‌పై సింగపూర్‌ వెళ్లారు. అలాగే ఫారిన్‌లో మాస్టర్స్‌ డిగ్రీ పూర్తి చేసి అక్కడే ఏడాదిపాటు రీసెర్చ్‌ చేశారు. అయితే ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ఇండియాకు తిరిగి వచ్చేశారు. యూపీఎస్‌సీకి రెండుసార్లు, ఏపీపీఎస్‌సీకి రెండుసార్లు ఇంటర్వ్యూ వరకు వెళ్లి ఎంపికై నా ప్రాధాన్యత కలిగిన పోస్టు రాలేదు. దీంతో తిరిగి తన ప్రయత్నం ప్రారంభించారు. 2023లో జరిగిన యూపీఎస్‌సీ ద్వారా ఎంపికై ప్రతిభాసేతు స్కీంలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా శిక్షణ పొందుతున్నారు. ఈ తరుణంలో విడుదలైన గ్రూప్‌–1 ఫలితాల్లో డీఎస్పీ పోస్టుకు ఎంపికయ్యారు. ఈ శుభ సందర్భాన్ని తల్లిదండ్రులు నాగభూషణ్‌రెడ్డి, భాగ్యలక్ష్మితో కలసి పంచుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement