శాస్త్రోక్తంగా రాహుకాల పూజలు
చౌడేపల్లె : మండల పరిధిలోని దిగువపల్లె గ్రామంలో వెలసిన బోయకొండ గంగమ్మ ఆలయంలో అమ్మవారికి శుక్రవారం భక్తిశ్రద్ధలతో శాస్రోక్తంగా గంగమ్మకు రాహుకాల పూజలు నిర్వహించారు. ఉదయాన్నే ఆలయ అర్చకులు అమ్మవారి గర్భాలయాన్ని శుద్ధిచేశారు. రాహుకాల సమయం 10:30 గంటల నుంచి 12 గంటల వరకు సంప్రదాయరీతిలో అర్చనలు, అభిషేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేకంగా బంగారు నగలు, పూలతో ముస్తాబుచేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మహిళలు ఉపవాస ధీక్షలతో తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఈఓ ఏకాంబరం ఆధ్వర్యంలో ఉభయదారులకు పవిత్ర తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భక్తులకు ఉచిత అన్నప్రసాదాలు పంపిణీ చేశారు.
వైఎస్సార్‌సీపీలో నియామకాలు
కడప కోటిరెడ్డిసర్కిల్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లాకుచెందిన పలువురిని వివిధ హోదాలలో నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉత్తర్వులు జారీ చేసింది.
● తంబళ్లపల్లెకు చెందిన కేవీ రమణ రాష్ట్ర ఎస్సీ సెల్ సెక్రటరీగా, రాయచోటికి చెందిన సయ్యద్ షబ్బీర్ రాష్ట్ర మైనార్టీ సెల్ జాయింట్ సెక్రటరీగా, రాజంపేటకు చెందిన పోలి రఘునాథరెడ్డిని రాష్ట్ర ఐటీ విభాగం జాయింట్ సెక్రటరీగా నియమితులయ్యారు. అదేవిధంగా తంబళ్లపల్లెకు చెందిన ఇ.ప్రవీణ్‌కుమార్‌రెడ్డిని డిస్ట్రిక్ట్ అఫిషియల్ స్పోక్స్ పర్సన్‌గా నియమితులయ్యారు.
రైతులకు యూరియా కష్టాలు
నిమ్మనపల్లె : యూరియా కోసం రైతులకు కష్టాలు తప్పడం లేదు. శుక్రవారం మండలంలోని సామకోటవారిపల్లె సచివాలయంలో వ్యవసాయశాఖ అధికారులు యూరియా పంపిణీ మొదలుపెట్టారు. విషయం తెలుసుకున్న రైతులు పెద్దసంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. తమకు ఎక్కడ యూరియా దక్కకుండా పోతుందోనన్న ఆదుర్దాతో ఒకరినొకరు తోసుకునే ప్రయత్నం చేయడంతో తొక్కిసలాట మొదలైంది. దీంతో అధికారులకు పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం నిమ్మనపల్లె పోలీస్‌స్టేషన్ నుంచి కానిస్టేబుల్ సామకోటవారిపల్లెకు చేరుకుని రైతులకు సర్దిచెప్పి క్యూలైన్ ఏర్పాటుచేశారు. సాయంత్రం వరకు 400 బస్తాల యూరియా పంపిణీ చేశారు.కొన్ని పంచాయతీలకు యూరియా రాకపోవడంతో రైతు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరతున్నారు.
1న షూటింగ్‌బాల్
జిల్లా జట్ల ఎంపిక
మదనపల్లె సిటీ : జిల్లా సబ్ జూనియర్ బాల,బాలికల షూటింగ్‌బాల్ జిల్లా జట్ల ఎంపిక ఫిబ్రవరి 1న జరుగుతుందని జిల్లా షూటింగ్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి గౌతమి తెలిపారు. ములకలచెరువు అక్సఫర్డ్ పాఠశాలలో ఎంపిక జరుగుతుందన్నారు. క్రీడాకారులు 1.4.2010 తర్వాత జన్మించి ఉండాలన్నారు. ఒరిజనల్ ఆధార్‌కార్డు తీసుకురావాలన్నారు.ఎంపికై న జట్లు పల్నాడులో ఫిబ్రవరి 8న జరిగే రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ షూటింగ్‌బాల్ ఛాంఫియన్‌షిప్ పోటీల్లో పాల్గొంటాయన్నారు. వివరాలకు 6281881022, 8179230577 నంబర్లలో సంప్రదించాలన్నారు.
శాస్త్రోక్తంగా రాహుకాల పూజలు


