మేలు లేదు
కేంద్ర బడ్జెట్‌లో సామాన్యులకు ఊరట కలగలేదు. ఈనెల 12న సార్వత్రిక సమ్మె ప్రకటించగా కార్మిక సమ స్యలపై కనీస ప్రస్తాపన లేకపోవడం విచారకరం. రూ.26 వేల వేతనం డిమాండ్ చేస్తుంటే పట్టించుకోలేదు. ధరల పెరుగుదల, ఉపాధి హామీ పథకం అమలుపై స్పష్టత ఇవ్వలేదు. ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతుంటే దానికి తగ్గట్టు బడ్జెట్‌లో ఎలాంటి ఊరటనిచ్చే ప్రకటన లేకపోవడం నిరాశ కలిగించింది. – సాంబశివ,
జిల్లా ప్రధాన కార్యదర్శి, ఏఐటియూసీ
సాక్షి ప్రతినిధి, కడప: కేంద్ర బడ్జెట్‌లో సీమకు మొండిచేయే మిగిలింది. ముఖ్యంగా వైఎస్సార్ కడప జిల్లా ఉక్కు పరిశ్రమ నిర్మాణ ఊసే లేకుండా పోయింది. ఫలితంగా నిర్మలమ్మ బడ్జెట్‌పై ప్రతిపక్షాలు పెదవివిరిచాయి. ప్రభుత్వ వేతనజీవులు...చిన్న, సన్నకారు రైతులపై మమ అన్పించడం మినహా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ప్రత్యేక చొరవ చూపెట్టలేదని విమర్శలు గుప్పించాయి. మధ్యతరగతి ప్రజానీకానికి కాస్త ఊరట కల్పించినా, పరోక్షంగా నడ్డివిరిచే చర్యలే అధికంగా ఉన్నాయని బడ్జెట్‌పై రాజకీయ పక్షాలు నినదిస్తున్నాయి.
● కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకత లభించలేదు. విభజన చట్టంలోని అంశాలకు గుర్తింపు దక్కలేదు. కడప ఉక్కు పరిశ్రమ నెలకొల్పాలని చట్టం చేసినా నరేంద్రమోదీ సర్కార్ విస్మరిస్తోంది. ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి ఎలాంటి నిధులు కేటాయించలేదు. ఈ పరిణామం జిల్లా వాసులకు రుచించడం లేదు. వెనుకబడిన ప్రాంతంలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పితే ఉద్యోగ ఉపాధి మార్గాలు మెరుగుపడుతాయన్న ధ్యాస కేంద్ర ప్రభుత్వానికి లేకపోయింది. 350 రకాల సంస్కరణలు చేశామని చెప్పినా, పేదలు, కార్మికులకు ప్రయోజనం లేదని నిపుణులు వివరిస్తున్నారు. 2026–27 కేంద్ర బడ్జెట్ విద్య రంగాన్ని తీవ్రంగా నిరాశపరిచింది. విశ్వవిద్యాలయాలకు ప్రత్యేక నిధులు, ఖాళీ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ, స్కాలర్‌షిప్‌లకు అధిక కేటాయింపులు విస్మరించింది. రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ, కడప–బెంగళూరు రైల్వే లైన్‌కు ప్రాధాన్యత దక్కలేదని పలువురు వివరిస్తున్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నీరు గార్చేందుకు మోదీ సర్కార్ కంకణం కట్టుకుందని, అందుకు నిర్మలమ్మ బడ్జెట్ కేటాయింపుల స్పష్టం చేశాయని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. గత బడ్జెట్‌లో 88వేల కోట్లు ఉపాధి హామీ పథకం కోసం కేటాయించగా, 2026–27లో కేవలం రూ.30వేల కోట్లు మాత్రమే కేటాయించడాన్ని ఉదహరిస్తున్నారు.
ఉద్యోగులను సంతృప్తి
పరచని కేంద్ర బడ్జెట్
పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ ఉద్యోగులకుసంతృప్తి పరిచే విధంగా లేదు. ఉద్యోగులకు పన్నుల రహిత ఆదాయం రూ.20లక్షలు ఉంటుందని ఆశించారు. కార్పోరేట్‌లకు ఇచ్చిన విధంగా అనేక రకాల పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలు, ఉద్యోగ వర్గాలకు కూడా ఉంటాయని అనుకున్నారు. బడ్జెట్‌లో ఇవి లేకపోవడం తీవ్ర నిరాశకు గురి చేస్తోంది.
–కొండూరు శ్రీనివాస రాజు,
రాష్ట్ర అధ్యక్షుడు, నోబెల్ టీచర్స్ అసోసియేషన్
పేదలు, కార్మికులకు ప్రయోజనం నిల్
ఉపాధి హామీ పథక
నిధుల్లో కోత
విద్యకు న్యాయం చేయని నిర్మలమ్మ
కొప్పర్తి పారిశ్రామికవాడ మాత్రమే పరిగణలోకి
ఉక్కు పరిశ్రమ ఊసే లేదు
మేలు లేదు
మేలు లేదు
మేలు లేదు
మేలు లేదు
మేలు లేదు
మేలు లేదు


