అంత్యక్రియలకు అభ్యంతరం | - | Sakshi
Sakshi News home page

అంత్యక్రియలకు అభ్యంతరం

Feb 5 2026 7:33 AM | Updated on Feb 5 2026 7:33 AM

అంత్యక్రియలకు అభ్యంతరం

అంత్యక్రియలకు అభ్యంతరం

పీలేరురూరల్‌ : మండంలోని కాకులారంపల్లె పంచాయతీ చిన్నగాండ్లపల్లె ఓ వ్యక్తి అంత్యక్రియలకు పక్క పొలం రైతులు అభ్యంతరం తెలిపి అడ్డుకున్న సంఘటన బుధవారం చోటు చేసుకుంది. వివరాలిలావున్నాయి. చిన్నగాండ్లపల్లెకు చెందిన బేతాళ కన్నయ్య మృతి చెందాడు. గతంలో తమ బంధువులను ఖననం చేసిన ప్రాంతంలోనే కన్నయ్య అంత్యక్రియలు నిర్వహించడానికి సిద్ధపడ్డారు. అయితే సమీప వ్యవసాయ పొలం యజమానులు తమ భూమి పక్కన ఖననం చేయరాదని అభ్యంతరం తెలిపారు. దీంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరిగి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సంఘటనపై మృతుని కుమారుడు రమేష్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తహసీల్దార్‌ శివకుమార్‌, ఎస్‌ఐ లోకేష్‌ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరు వర్గాలకు సర్దిచెప్పి సర్వే నంబరు 1034లో ప్రభుత్వ భూమి 25 సెంట్లను శ్యశానానకి కేటాయించి శాశ్వితంగా సమస్య పరిష్కరించారు. దీంతో సమస్య పరిష్కారమైంది. . ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ మురగయ్య, సర్వేయర్‌ రెడ్డిశేఖర్‌, వీఆర్‌వో ఆజయ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement