కృషి ఉంటే తెరపై తారగా వెలగచ్చు
కురబలకోట: సినిమా రంగం కలల ప్రపంచమని, కొత్త వారు రాణించాలంటే టాలెంట్‌తోపాటు తగిన స్కిల్స్ తప్పనిసరి అని మూవీ ప్రొడ్యూసర్ ఆరవింద్ మండెం, డైరెక్టర్ మధుదీప్ అన్నారు. గురువారం అంగళ్లు డీమ్డ్ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ కల్చరల్ క్లబ్, ఫిలిం మేకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇండస్ట్రియల్ మూవీ వర్క్‌షాప్ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన వారు మాట్లాడుతూ నేడు పోటీతో కూడిన సినీ రంగంలో పైకి రావాలంటే పర్సనాలిటీతోపాటు యాక్టింగ్ నైపుణ్యం, డైలాగ్ డెలివరీ, భావ ప్రకటన అవసరమన్నారు. అంతేగాకుండా కెమెరా ముందు ఎలా నిలుచొవాలి, లైటింగ్‌కు అనుగు ణంగా నటించడంతోపాటు డైరెక్టర్ ఆశిస్తున్న యాక్టింగ్‌ను అర్థం చేసుకోవాలన్నారు. దర్శకు లు, నిర్మాతలతో సంబంధాలు కూడా అవ కాశాలను నిర్దేశిస్తాయన్నారు. ఇంజినీరింగ్ విద్య లో చదువులకే పరిమితం కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్, సృజన, కమ్యూనికేషన్ స్కిల్స్‌పై పట్టు సాధించాలన్నారు. ఇంజినీరింగ్ చదువులు ఆధునిక కెమె రా, ఎడిటింగ్, విజువల్ టూల్స్‌కు కూడా ఉపయోగకరంగా ఉంటున్నాయన్నారు. కార్యక్రమంలో క్లబ్ కన్వీనర్ వై.ప్రదీప్‌కుమార్, ఫిలిం మేకర్స్ క్లబ్ కో ఆర్డినేటర్ రియాజ్ అలీ పాల్గొన్నారు.


