ఆర్టీసీ కడప జోన్‌ ఈడీగా రాఘవకుమార్‌ | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ కడప జోన్‌ ఈడీగా రాఘవకుమార్‌

Feb 4 2026 7:17 AM | Updated on Feb 4 2026 7:17 AM

ఆర్టీసీ కడప జోన్‌ ఈడీగా రాఘవకుమార్‌

ఆర్టీసీ కడప జోన్‌ ఈడీగా రాఘవకుమార్‌

ఆర్టీసీ కడప జోన్‌ ఈడీగా రాఘవకుమార్‌

కడప కోటిరెడ్డిసర్కిల్‌ : ఆర్టీసీ కడప జోన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఈడీ)గా మంగళవారం ఎస్‌టీపీ రాఘవకుమార్‌ బాధ్యతలు స్వీకరించారు. మొన్నటి వరకు ఈడీగా పని చేసిన పైడి చంద్రశేఖర్‌ ఉద్యోగ విరమణ చేయడంతో ఆయన స్థానంలో అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో డీపీటీఓగా పని చేస్తున్న రాఘవకుమార్‌ను పదోన్నతిపై నియమించారు. ఈయన మొదట 1988లో ఆర్టీసీలో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి 1990–93లో నరసరావుపేట డీఎంగా, 1993–96లో ఈస్ట్‌ గోదావరి జిల్లా రాజోలు డీఎంగా పని చేశారు. 1996–99లో విజయవాడలోని జోనల్‌స్టోర్‌లో, 1999–2004లో ప్రధాన కార్యాలయంలో పర్చేజ్‌ ఆఫీసర్‌గా, 2004–2007లో ప్రొద్దుటూరు డీవీఎంగా, 2007–19లో ప్రధాన కార్యాలయంలోని కంట్రోల్‌ ఆఫ్‌ స్టోర్‌లో పని చేశారు. 2019లో ఈస్ట్‌ గోదావరి డిప్యూటీ సీఎంఈగా, 2020–21లో గుంటూరు రీజినల్‌ మేనేజర్‌గా, 2022–24లో విజయవాడలోని కంట్రోలర్‌ ఆఫ్‌ స్టోర్స్‌లో పని చేశారు. 2025 ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో డీపీటీఓగా పని చేస్తూ పదోన్నతిపై కడపకు ఈడీగా వచ్చారు. ఆయన రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement