15లోపు పన్ను వసూళ్లు పూర్తిచేయాలి
● జిల్లాకు 37 స్వచ్ఛ రఽథాలు
● డీపీఓ రాధమ్మ
మదనపల్లె రూరల్: జిల్లాలోని అన్ని పంచాయతీల్లో రూ.19 కోట్ల పన్ను వసూళ్లు బకాయిలు ఉన్నాయని, ఫిబ్రవరి 15లోపు వాటిని వసూలు చేయాలని డీపీఓ రాధమ్మ ఆదేశించారు. మదనపల్లె ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం జిల్లాలోని అన్ని మండలాల డిప్యూటీ ఎంపీడీఓలతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆమె మాట్లాడారు. పంచాయతీ కార్యదర్శులు అన్ని పన్ను వసూళ్లను స్వర్ణ పంచాయతీ యాప్ ద్వారానే వసూలు చేయాలన్నారు. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ సక్రమంగా జరిగేలా చూడాలన్నారు. జిల్లాలో ప్రస్తుతానికి 2 స్వచ్ఛ రధాలు సేవలందిస్తున్నాయని, జిల్లాకు మొత్తం 37 స్వచ్ఛ రథాలు మంజూరయ్యాయన్నారు. జిల్లాలోని రెవెన్యూ గ్రామాల్లో స్వమిత్వ సర్వే 204 గ్రామాల్లో పూర్తి కావస్తోందని, సర్వే వివరాలను పీయూజీఐఎస్ సాఫ్ట్‌వేర్ యాప్‌లో సరిచూసుకోవాలన్నారు. డీఎల్‌పీఓ నాగరాజు, డిప్యూటీ ఎంపీడీఓలు పాల్గొన్నారు.


