ట్రాన్స్‌కో డీఈఈగా ఎన్‌ఎల్‌డీ లివింగ్ స్టన్
రాయచోటి: రాయచోటి ట్రాన్స్‌కో డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా ఎన్‌ఎల్‌డీ లివింగ్ స్టన్ ఆదివారం బాధ్యతలు చేపట్టారు. స్థానికంగా పనిచేస్తున్న యుగంధర్ శనివారం ఉద్యోగవిరమ ణ పొందారు. ఆయన స్థానంలో నెల్లూరులో డీఈ గా పనిచేస్తూ పదోన్నతి మీద ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్‌గా రాయచోటి డివిజన్‌కు బదిలీ అయ్యారు. బాధ్యతలు చేపట్టిన డీఈఈకి ఉద్యోగులు, కార్మికులు శుభాభినందనలు తెలియజేశారు.
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: కేంద్ర ప్రభుత్వం అను సరిస్తున్న కార్మిక, ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసే విధానాలను వ్యతిరేకిస్తూ ఈ నెల 12న జాతీయ కార్మిక సంఘాలు నిర్వహించను న్న సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి. ఓబులు తెలిపారు.ఆది వారం యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సీఐటీయూ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లా డారు. కార్పొరేట్ యాజమాన్యాల ఒత్తిడితోనే పాలకవర్గం లేబర్ కోడ్స్ అమల్లోకి తెచ్చిందన్నా రు. 8గంటల పని దినాలను 10గంటలకు పెంచు తూ తీసుకువచ్చిన జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
బి.కొత్తకోట: మండలంలోని హార్సిలీహిల్స్‌పైకి అంగళ్లు మిట్స్ కళాశాలకు చెందిన ఎన్‌సీసీ విద్యార్థులు ఆదివారం ట్రెక్కింగ్ నిర్వహించారు. 14 మంది ఎయిర్‌వింగ్ క్యాడెట్లు శారీరక ధృడత్వం, మానసిక ధైర్యం, నాయకత్వ లక్షణాలను పెంపొందించే చర్యల్లో భాగంగా ట్రెక్కింగ్ నిర్వహించారు. 9 కిలోమీటర్ల ట్రెక్కింగ్ నిర్వహించారు. కార్యక్రమాన్ని ఎయిర్‌వింగ్ సిటిఓ డాక్టర్ చరణ్ పర్యవేక్షించారు.
మదనపల్లె సిటీ: ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ఆదివారం ప్రారంభమయ్యాయి. జిల్లాలో 39 జనరల్ సెంటర్లు,రెండు ఒకేషనల్ సెంటర్లలో ప్రాక్టికల్స్ జరిగాయి. ఉదయం 9 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు రెండు సెషన్స్ నిర్వహించారు. ప్రాక్టికల్స్ కేంద్రాలను ఇంటర్మీడియట్ బోర్డు జిల్లా అధికారి రవి మదనపల్లె, రాయచోటిలోని ప్రభుత్వ,ప్రెవేటు జూనియర్ కాలేజీల పరీక్షా కేంద్రాలను తనిఖీలు చేశారు. విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. తొలి రోజు ప్రాక్టికల్స్ ప్రశాంతంగా జరిగినట్లు తెలిపారు.
ట్రాన్స్‌కో డీఈఈగా ఎన్‌ఎల్‌డీ లివింగ్ స్టన్
ట్రాన్స్‌కో డీఈఈగా ఎన్‌ఎల్‌డీ లివింగ్ స్టన్


