మానవాళికి మాతృమూర్తి లూర్దుమాత | - | Sakshi
Sakshi News home page

మానవాళికి మాతృమూర్తి లూర్దుమాత

Feb 3 2026 7:27 AM | Updated on Feb 3 2026 7:27 AM

మానవాళికి మాతృమూర్తి లూర్దుమాత

మానవాళికి మాతృమూర్తి లూర్దుమాత

కడప సెవెన్‌రోడ్స్‌ : ప్రపంచ మానవాళికి మాతృమూర్తి లూర్దుమాత అని నెల్లూరు పీఠం నూతన ఆధ్యాత్మిక సహ సారధి పిల్లి ఆంథోనిదాస్‌ తెలిపారు. కడప నగరంలోని మరియాపురంలో వెలసిన లూర్ధుమాత మహోత్సవాలు ఈ నెల 10,11 తేదీల్లో వైభవంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం పాత చర్చి ఆవరణలో ఆయన పతాకావిష్కరణ చేశారు. తొలుత బిషప్‌ను మరియాపురం పుర వీధుల గుండా ఊరేగింపు చేశారు. అనంతరం దివ్యబలి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆధ్యాత్మిక సందేశమిచ్చారు. మానవుని ప్రతి పాపమునుంచి రక్షించ గల శక్తి ఏసుక్రీస్తుకు ఉందన్నారు. అలాంటి దేవునికి మానవులకు మధ్య వారధిగా లూర్దుమాత ఉందని చెప్పారు. నవదిన జపమాల కార్యక్రమాల్లో విశ్వాసులందరూ భక్తి శ్రద్ధలతో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విచారణ గురువులు ఈరి మరియన్న , సహాయ గురువు జంపంగి సుధాకర్‌, వివిధ విచారణకు చెందిన ఫాదర్స్‌ సిప్రియన్‌,బి జ్వాన్నేష్‌, టి.ఫ్రాన్సిస్సేజేవియర్‌,లూర్ధురాజు,తిరుణాల కమిటీ చైర్మన్‌ గుంత మళ్ళ బాలయ్య ,ప్రధాన కార్యదర్శి వారాధి జోసెఫ్‌, ఎండీ అల్ఫోన్స్‌, నంది మండలం విజయరాజు, విశ్వాసులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement