నాటు ఆవుకు పుంగనూరు దూడ జననం
చౌడేపల్లె మండలంలోని దుర్గసముద్రం పంచాయతీ దాదేపల్లెకు చెందిన షేక్ రాహుల్‌కు చెందిన నాటుఆవు(అల్లికారుజాతి)కు శుక్రవారం పుంగనూరు జాతి దూడ జన్మించింది. పశువైద్య సిబ్బంది సూచనల మేరకు పుంగనూరు జాతి సెమన్ వేయించామని, అంతేకాక వారి సలహాలు పాటించడంతో పుంగనూరు జాతి పేయిదూడ జన్మించిందని రాహుల్ తెలిపారు. చిన్నపాటి ఎత్తు గల పుంగనూరు మేలు జాతి దూడను చూసేందుకు గ్రామస్తులు క్యూకట్టారు. ఈ జాతి దూడలు, ఆవులకు మార్కెట్‌లో భారీగా డిమాండ్ ఉంది. – చౌడేపల్లె
ఆక్రమణల తొలగింపు షురూ
మదనపల్లె : మదనపల్లె పట్టణంలోని రోడ్లకు ఇరువైపులా ఆక్రమణల తొలగింపు చర్యలు మొదలయ్యాయి. శుక్రవారం పటేల్‌రోడ్డులో అక్రమంగా నిర్మించిన కట్టడాలను జేసీబీలతో తొలగించారు. దుకాణ దారులు రహదారిని ఆక్రమించి దానిపై మెట్లు, బోర్డులు, వాహనాల పార్కింగ్ కోసం, దుకాణాలకు వచ్చేవారికి విశాలమైన స్థలం ఉండేలా ఇలాంటి ఆక్రమణలను చేశారు. వీటిని ఇప్పుడు తొలగిస్తున్నారు. ఈ రహదారి పక్కనే ఆస్పత్రి ఉండగా దాని కాంపౌండ్ గోడవైపు మొత్తం రోడ్డు ఆక్రమించారు. వాటిపై నిర్మాణాలు, బంకులు ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు చేసుకుంటున్నారు. వీటిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకొంటారో అని స్థానికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పట్టణంలోని ప్రధాన రహదారులు, వీధుల్లో ఇలాగే ఆక్రమణలను తొలగిస్తారా లేదా అని పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు.
పూర్తి స్థాయి చర్యలపై అనుమానాలు
నాటు ఆవుకు పుంగనూరు దూడ జననం
నాటు ఆవుకు పుంగనూరు దూడ జననం


