కూటమి విజయం వెనుక ఎన్నో అనుమానాలు | - | Sakshi
Sakshi News home page

కూటమి విజయం వెనుక ఎన్నో అనుమానాలు

Feb 4 2026 7:17 AM | Updated on Feb 4 2026 7:17 AM

కూటమి

కూటమి విజయం వెనుక ఎన్నో అనుమానాలు

కూటమి విజయం వెనుక ఎన్నో అనుమానాలు ● అక్రమ కేసులకు భయపడేది లేదు

పుంగనూరు: 2024 ఎన్నికల్లో కూటమి పార్టీల విజయం వెనుక ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం ఎర్రాతివారిపల్లెలో మంగళవారం నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తొలుత దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సభలో పెద్దిరెడ్డి మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి పార్టీలు ఈవీఎంలతో గెలిచాయా? అనే అనుమానాలు ఉన్నాయన్నారు. ఏది ఎలా ఉన్నా రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్‌ ప్రజా విశ్వాసాన్ని కోల్పోయి, కులాల వారీగా నాయకుల ఇళ్లపై దాడులు, అక్రమ కేసులు పెట్టి అరెస్ట్‌లు చేయిస్తోందని మండిపడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వం ప్రజా విశ్వాసం కోల్పోయి అనైతిక పాలన సాగిస్తోందని విమర్శించారు.

అందరి లక్ష్యం జగన్‌ను

మళ్లీ సీఎం చేయడమే

ఉమ్మడి జిల్లాల పార్టీ అధ్యక్షుడు భూమన కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ అందరి లక్ష్యం వచ్చే ఎన్నికల్లో వైఎస్‌.జగన్‌ను గెలిపించి, మళ్లీ సీఎంగా చేయడమేనని అన్నారు. వచ్చే ప్రభుత్వంలో కార్యకర్తల పాలన సాగుతుందని, ఇప్పటికే జగన్‌ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. పార్టీ సంస్థాగత పటిష్టత, కార్యకర్తల క్రీయాశీలత, సర్వసన్నద్ధతతో బలంగా ఉన్న పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిస్థితులను ఆదర్శంగా తీసుకుని అన్ని నియోజకవర్గాల్లో ఇదే విధానం అమలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. గత పాలనలో పొరపాట్లు జరిగి ఉండవచ్చు, ఇప్పుడు వాటిని సమీక్షించుకోవడం వల్ల ప్రయోజనం లేదన్నారు. భవిష్యత్తులో పార్టీ ఏ నిర్ణయం తీసుకోవలసి ఉన్నా గ్రామస్థాయి కమిటీల అభిప్రాయాలు, సూచనలు కీలకమౌతాయని అన్నారు.

గ్రామ కమిటీల ఏర్పాటులో

పుంగనూరు ప్రథమం: మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డి మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో పుట్టిన చంద్రబాబు ముఖ్యమంత్రిగా 18 ఏళ్లు పరిపాలన సాగించినా కూడా ప్రజాభిమానంలో పెద్దిరెడ్డి వెనకనే ఉన్నారని తెలిపారు. శివశంకర్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సూచించిన మేరకు గ్రామ కమిటీలను పటిష్టంగా ఏర్పాటు చేయడంలో పుంగనూరు నియోజకవర్గం ప్రథమ స్థానంలో నిలిచిందని కొనియాడారు. పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శి వజ్రభాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ కమిటీలు ప్రతినెల మూడవ ఆదివారం రచ్చబండ కార్యక్రమాలను నిర్వహించి, ప్రజా సమస్యలపై చర్చించడం జరుగుతుందన్నారు. కమిటీ సభ్యులకు గుర్తింపు కార్డులు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో మాజి ఎంపీ రెడ్డెప్ప, టీటీడీ మాజీ బోర్డు సభ్యులు పోకల అశోక్‌కుమార్‌, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు పెద్దిరెడ్డి, అనీషారెడ్డి, రెడ్డిశ్వర్‌రెడ్డి, ఫృధ్వీదర్‌రెడ్డి, వెంకటరెడ్డి యాదవ్‌, ఉమ్మడి జిల్లాల ఐటీ వింగ్‌ ఇన్‌చార్జ్‌ ప్రకాష్‌రెడ్డితో పాటు పార్టీ నాయకులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, అనుబంధ సంస్థల నాయకులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్రంలో వైఎస్సార్‌సీపీ ముఖ్య నేతలు

సమావేశంలో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు

చంద్రబాబు సర్కార్‌ ప్రజా విశ్వాసాన్ని కోల్పోయింది

కులాల వారీగా నాయకుల ఇళ్లపై దాడులు చేయిస్తోంది

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులకు, అరెస్ట్‌లకు భయపడేది లేదన్నారు. ప్రజలతో కలసి పోరాటం చేసి విజయం సాధిస్తామన్నారు. వైఎస్సార్‌సీపీ టాస్క్‌ఫోర్స్‌ సభ్యులు, ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ప్రజా సంక్షేమం ఆవిర్భవించిందన్నారు. వైఎస్సార్‌సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు అకేపాటి అమరనాథరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి మరణం తరువాత వైఎస్‌.జగన్‌కు అండగా ఉండేందుకు అభిమానులు అందరితో కలసి ఒక ఎమోషన్‌తో వైఎస్సార్‌సీపీ ఆవిర్భవించిందని కొనియాడారు.

కూటమి విజయం వెనుక ఎన్నో అనుమానాలు1
1/1

కూటమి విజయం వెనుక ఎన్నో అనుమానాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement